WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 7 June 2021

MJPAP BCWREI Class 5 Admissions 2021-22-Notification-Schedule-Fee Payment-Online Application

Mahatma Jyotiba Phule AP Backward Classes Welfare Residential Educational Institutions Society MJPAP BCWREI Class V Admissions 2021-22-Notification-Schedule-Fee Payment-Online Application MJPAP BCRJC CET 2021 

మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ (8) 2వ అంతస్తు, ప్లాట్ నెం.9, 4 వ వీధి, బండి స్టాన్లీ వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు, విజయవాడ-520007 2021-22 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి ప్రవేశ ప్రకటన

మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే నడుప బడుచున్న 92 పాటశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో విద్యార్ధులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాటశాలల కేటాయింపు జరుగును.

ప్రవేశానికి అర్హత: 

1. వయస్సు: బి.సి. మరియు ఈ .బి.సి (BC / EBC) లకు చెందిన వారు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి. యస్.సి. మరియు యస్.టి. (ఎస్సి/ఎసి) లకు చెందిన వారు 01-09-2008 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి.

2. సంబంధిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యాసంవత్సరములలో నిరవదికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాటశాలలో 3 మరియు 4 తరగతులు చదివి వుండాలి. 

3. ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము 2020-21 ఆర్థిక సంవత్సరమునకు రూ.1,00,000/-లు మించి ఉండరాదు. 

4. దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 

5. దరఖాస్తు చేయు విధానం అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేదీ 14-06-2021 నుండీ తేదీ 10-07-2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉదయం 10.00 గం.ల నుండి సాయంత్రం 4.30 గం.ల లోపు పాఠశాలల ప్రిన్సిపాల్ వార్ల నెంబర్ లకు సంప్రదించగలరు.

పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం:

1. రిజర్వేషన్ ( రిజర్వేషన్ల వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినది)

2. స్థానికత

3. ప్రతేక కేటగిరి (అనాధ/ మత్స్యకారులు పిల్లలు) మరియు 

4. అభ్యర్థి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును

5. జిల్లాలవారీగా పాఠశాలల వివరాలు, జిల్లాలు పట్టిక మరియు పాఠశాల వారీగా కేటాయించిన సీట్లు పట్టిక (2) నందు ఇవ్వబడినది.

6. ప్రవేశములు లాటరీ పద్ధతి ద్వారా చేయబడును.

Official website

Online Application click here

Download MJPAP BCWREI Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...