TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 25 July 2020

Alternative Academic calendar 2020-21 - Instructions on Student, School, Lesson Plans, Online classes, Exams, Admissions, teacher Attendance, Bio-Metric

 ఆర్.సి.నం: 151/e&1/2020 తేది: --07.2020

విషయం: పాఠశాల విద్య, ఆంధ్రప్రదేశ్ - 2020-21 విద్యా సంవత్సరం - కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు మరింత స్పష్టత కొరకై ఆదేశాలు ఇచ్చుట- గురించి.

ప్రస్తుతానికి, రాష్ట్రంలో పాఠశాలలు 5 సెప్టెంబరు. 2020 నుండి ఆలోచిస్తున్నందువల్ల, తేది 27-7-2020 నుండి 4-9-2020 వరకు అన్ని పాఠశాలల్లోనూ ఈ కింది విధంగా చర్యలు తీసుకోవలసినదిగా సూచించడమైనది:

విద్యార్థి వారీ ప్రణాళిక:

20. మొదటగా ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులకు రూపొందించుకోవాలి

విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి:

ఆ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు (హై టెక్), ప్రారంభించాలని
ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు (లో టెక్) 
ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు (నో టెక్).

గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనుకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువమందికి ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారి పైన దృష్టి పెట్టే విధంగా ఉపాధ్యాయుడు తన ప్రణాళిక తయారు చేసుకోవాలి

 ఆ ప్రణాళిక ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవాలి

అ) 1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 (నాలుగు వారాలు మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన కృత్యాలు చేయించడం. ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫోటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి. ఆ కృత్య పత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ కృత్య పత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి వారి ద్వారా విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ ప్రత్యామ్నాయ క్యాలెండర్ పర్యవేక్షించాలి
ఆ) 6 నుండి 8 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో చూపిన ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి. పిల్లలు అటువంటి కృత్యాలు ఏ విధంగా చేపట్టాలో వారి తల్లిదండ్రులకు వివరించాలి.దూరదర్శన్ ద్వారా ప్రతి వారం ఒక పాఠం ద్వారా వివరించాలి.
 దూరదర్శన్ సౌకర్యం ఉన్న విద్యార్థులను లేని విద్యార్థులతో ఇద్దరిద్దరు చొప్పున జతపరిచి సౌకర్యాలు ఉన్న విద్యార్థుల ద్వారా సౌకర్యాలు లేని విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు ఆ విధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారో లేదో తల్లిదండ్రుల ద్వారా పర్యవేక్షించిన కోవాలి
ఇ) 9, 10 తరగతులకు: వీరికి విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఇందుకుగాను, నాలుగు వారాల ప్రత్యామ్నాయ కాలెండరును ఉపయోగించుకోవాలి. వారికి ఆన్ లైన్, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు. అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లయితే వారి సేవలు కూడా వినియోగించుకోవచ్చు

పాఠశాల ప్రణాళిక:

24. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా తన ప్రణాళిక రూపొందించుకున్న తరువాత ప్రధానోపాధ్యాయుడు వాటిని పరిశీలించి పాఠశాల ప్రణాళిక రూపొందించుకోవాలి. జూలై 27 నుంచి సెప్టెంబర్ 4 వరకు 40 రోజుల వ్యవధి ఉన్నందున, నలభై రోజుల ప్రణాళిక ద్వారా తాము ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించబోతుంది నిరంతరం పర్యవేక్షిస్తూ స్పష్టంగా భౌతిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

తల్లిదండ్రుల కమిటీ సమావేశం:
  • పాఠశాలవారీ ప్రణాళిక రూపొందించుకున్నాక, తలిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. వారి ద్వారా తక్కిన తల్లిదండ్రులకి సమాచారం అందించాలి
  • ఆ సమావేశంలో తమ ప్రణాళికను వివరించాలి. అలాగే స్థానికంగా ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్చంద సేవలు వినియోగించుకునేలా తల్లిదండ్రుల కమిటీకి సూచించాలి. అటువంటి స్వచ్ఛంద కార్యకర్తలకు ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు. ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వబడవు. వారు తమ సేవలను పూర్తి ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా అందచేయవలసి ఉంటుంది. స్వచ్చంద సేవకులు కూడా కోవిద్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి
పరీక్షలు:
  •  1నుండి 8 వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించారు. కానీ మూల్యాంకనం (అసెస్మెంట్) చేపట్టపలసి ఉంటుంది. విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా లేదా అన్నది మాత్రం పరిశీలించవలసి ఉంటుంది
  •  తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్లు నిర్వహించుకోవచ్చు గాని, అవి కేవలం ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ సంబంధించినవే అయి ఉండాలి. విద్యాసంవత్సరం ఇంకా మొదలుకాలేదు కాబట్టి, సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించరాదు. విద్యార్థులు, వారికి రూపొందించిన వారాంతపు కృత్యాల ద్వారా పొందవలసిన 'బిల్డింగ్ అవుట్ కమ్స్ సాధించారా లేదా అనే విషయంలో స్పష్టత ఉండాలి.
ప్రీ ప్రైమరీ: రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు యూనిఫాం ధరించి ఆన్ లైన్ తరగతులకు హాజరు కావలసిందిగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. అటువంటి ప్రయత్నాలు చట్టపరంగానే కాక నైతికంగా కూడా చెల్లనేరవు. అటువంటి ప్రయత్నాల్ని సామాజిక దురాచారాలుగా తల్లిదండ్రులు గుర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చే విద్యాసంస్థల్ని అలాంటి ప్రయత్నాలు చేయకూడదని ఇందుచెంట ఆదేశించనైనది

ఆన్ లైన్ తరగతులుఆన్ లైన్ తరగతుల విషయమై కూడా కొంత స్పష్టత ఇవ్వవలసిందిగా విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖను కోరుతున్నారు. అందువల్ల ఈ కింది దేశాలను గమనించండి

అ) పాఠ్యబోధనకు ఆన్ లైన్ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే పరిమితమై ఉండాలి ఆ) ఆన్ లైన్ అంటే కంప్యూటర్ ద్వారా గాని దూరదర్శన్ ద్వారా గాని చేపట్టే బోధన విషయంలో ఒక రోజుకి ఎంత సమయం కేటాయించాలి అన్నదాని మీద భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

పాఠశాలల్లో ప్రవేశాలు:
  • అన్ని పాఠశాలలో 2020-21 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టవచ్చును
  • ఆ విధంగా ప్రవేశాలు చేపట్టడానికి ఈ దిగువ చూపి విధంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.
  • అ) కోవిడ్ -19 నివారణకి చేపట్టిన సూచనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టాలి 
  • ఆ) ప్రవేశాల నిమిత్తం ఏ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రప్పించాడు
  • ఇ) 2019-20లో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుండి 7 వరకు, ఉన్నత పాఠశాల 6 నుండి 9 వ తరగతి వరకు చదివి, ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడ్డ విద్యార్థులందరిని తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేసి వారి పేర్లు పాఠశాల అడ్మిషను రిజిష్టరులో పై తరగతిలో నమోదు చేయాలి
  • ఈ) ప్రాథమిక పాఠశాల 5 వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7 వ తరగతి చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి. గవ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, వ తరగతి ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి 
  • ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చు నిమిత్తం వారి రికార్డు షీటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ఆయా సర్టిఫికేట్లను తల్లిదండ్రులకు విధిగా అందించాలి. అనే విధంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు/ ట్రాన్స్టర్స ర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి. ఒకవేళ విద్యార్థి రికార్డు షీటు/ ట్రాన్స్టర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే కాలక్రమంలో వాటి

ఉపాధ్యాయులు హాజరు:
  • విద్యార్థులకు భారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది. కాని అందరూ విధిగా ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు. వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఆదేశాలు నాడు నేడు పాఠశాలలకు కూడా పర్తిస్తాయి
  • ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు. 
  • దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీంక వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు కానవసరం లేదు. కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థి వారీగా ప్రణాళిక తప్పని సరిగా రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక ఉపాధ్యాయుల పని సమీక్ష అమలు పరచాలి.
ఉపాధ్యాయుల పని సమీక్ష:
  • ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యవలసి ఉంటుంది. ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది. మరుసటి రోజు సుండి రోజుకు అయిదుగురు చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల ప్రగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి
  •  ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను ప్రతి శనివారం ఫోటో లేదా డాక్యుమెంట్ ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి
  • అందరు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆ మార్గదర్శకాలు గమనించవలసినదిగా కోరనైనది. ఈ మార్గదర్శకాలు ఆంగ్లంలో ఉన్నవి ఉన్నట్లుగా పొందుపరుస్తున్నాం. తెలుగు అనువాదం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్ సి ఇ ఆర్ టి) వారు త్వరలో 'అభ్యాస' యాప్ ద్వారా విడుదల చేయనున్నారు.
  • విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో ఒక వాట్సప్ గ్రూపును రూపొందించి రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థుల అభ్యసన ప్రక్రియ. విద్యార్థుల మూల్యాంకనం. ప్రగతి సంబంధించిన విషయాలు పాలుపంచుకోవాలి డిజిటల్ మాధ్యమాలు ఏవీ అందుబాటులో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సంచార వాహనాలు రూపొందించడమైనది. ఈ వాహనాలు ఆయా విద్యార్థులు ఉండే ప్రదేశాలను గుర్తించి వారిని ఈ ప్రత్యామ్నాయ బోధనభ్యసన ప్రక్రియలో పాల్గొనేటట్లు కృషి చేయడం జరుగుతుంది
దీనితో పాటు అనుబంధంగా ప్రత్యామ్నాయ అకడమిక్ కాలెండర్' జత చేయడమైనది.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...