WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 23 October 2018

Balotsav 2018 - Competitions - Rules - Schedule - Registration Forms

వివిఐటి బాలోత్సవ్

నంబూరు గ్రామం,
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా 
ఆంధ్రప్రదేశ్ 52250
పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో అందుకోలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతోంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమిష్ఠి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.
జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 36 విధాలైన పోటీలు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.


బాలోత్సవ్ 2018 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.

1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం డౌన్ లోడ్   చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.

కన్వీనర్,
వివిఐటి బాలోత్సవ్ 2018,
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
నంబూర్ గ్రామం,
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా.
ఆంధ్రప్రదేశ్ 522508


2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.

Download Balotsav 2018 Schedule 
Download Balotsav 2018 Manual (Offline) Entry Form 
Download Balotsav 2018 Android APP for online Registration
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...