TRENDING NOW

TIS Login Link How to Update TIS

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday, 2 January 2026

TIS FAQs Doubts-Clarifications

TIS FAQs Doubts-Clarifications 2026, TIS Updation Frequently Asked Questions

S.No    
1  TIS ఏ ఉపాధ్యాయులు పూర్తి చేయాలి? ప్రైవేటు అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ తప్ప అందరూ
2  TIS లో ఏ పాఠశాల నమోదు చేయాలి?  జీతం తీసుకునే పాఠశాల.
3  హెల్త్ కార్డులో డిపెండెంట్‌లు లేకపోతే ఏమి చేయాలి?  డిపెండెంట్ లు సంఖ్య దగ్గర సున్నా ఎంటర్ చేసి ముందుకు వెళ్ళవచ్చు
4  CFMS ID నమోదు తప్పనిసరా?  రెగ్యులర్ ఉపాధ్యాయులకి ఇది తప్పనిసరి.
కాంట్రాక్టు తదితరులకు ఇది ఐఛ్ఛికము..
5  హెల్త్ కార్డు లో డిపెండెంట్ లు అదనంగా చేర్చ వలసి వస్తే?  డిపెండెంట్‌ల సంఖ్యను నమోదు చేసి, Add బటన్ ద్వారా వారి వివరాలు నమోదు చేయాలి.
6  భార్యాభర్తలు లో ఒకరికే హెల్త్ కార్డు ఉంటుంది. రెండవ వ్యక్తి ఏమి చేయాలి?  ఉన్న హెల్త్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, డిపెండెంట్‌ల సంఖ్య 0 చూపించి పూర్తి చేయాలి.
7  డిగ్రీ వివరాలలో Add మరియు Remove బటన్ లు ఉపయోగం ఏమిటి?  Add బటన్ ద్వారా మనకి ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని వరుసలు వచ్చేలా సృష్టించుకొని వివరాలు సమర్పించవచ్చు. Remove బటన్ ఉపయోగించి అనవసరంగా సృష్టించిన వరుసలు రద్దు పరచవచ్చు
8  విద్యా వివరాలలో ప్రతిచోటా కొన్ని ఖాళీలు కనబడుతున్నాయి. ఎందుకు?  అవును. కొత్తగా కొన్ని వివరాలు అడగడం జరిగింది. అవి సమర్పించవలసి ఉంటుంది
9  విద్యా వివరాల వద్ద సమర్పించిన వివరాలు ఉన్నప్పటికీ,NO అని సెలక్షన్ చేసుకొంటే ఏమవుతుంది? ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఉన్న డేటా డేటా తీసివేయబడును తీసివేయ అని ఒక పాప్-అప్ లో అడగబడును. మీరు Yes అని ఎంచుకొంటే గతంలో ఆ అర్హత పరంగా ఉన్న వివరాలు తొలగించబడతాయి. అవసరం అనుకొంటే తిరిగి మరల వివరాలు సమర్పించాలి.
10  కొంతమందికి కొన్ని అర్హతల వద్ద వివరాలు పునరావృతం అయ్యాయి.ఏమి చేయాలి?  పునరావృతం అయిన వివరాలు Remove బటన్ ద్వారా తొలగించవచ్చు
11  డిగ్రీ సింగిల్ సబ్జెక్టు వారు ఎక్కడ నమోదు చేయాలి?  సాధారణ డిగ్రీ నందు మూడు ఐఛ్చికాలు నమోదు చేయవలెను. కావున చివరన ఉన్న Other degrees అనే విభాగంలో నమోదు చేయవచ్చు.
12  డిగ్రీ నందు విద్వాన్ తదితరాలకు ఒకటే ఐఛ్ఛికం ఉంటుంది. వారు ఏమి చేయాలి?  అటువంటి కోర్సులకు ఒక ఐఛ్చికం తప్పనిసరి మరియు మిగిలనవి ఐఛ్చికంగా వెసులుబాటు ఇవ్వబడును
13  Appointment window నందు present school details 25 అవడం లేదు?  ఈ విభాగపు వివరాలు Transfers window లో ప్రస్తుత పాఠశాల రికార్డు నుండి ఆటోమేటిక్ గ వచ్చేలా చేయడం జరిగింది. కావున ఎడిట్ ఉండదు
14  Transfers వివరాలు నందు ఇంతవరకు బదిలీ కాని ఉపాధ్యాయులు ఏమి చేయాలి?   ప్రస్తుత పాఠశాల వివరాలు ఈ టేబుల్ నుంచే తీసుకోబడును.కావున “1 "వేసి, GO నొక్కి ప్రస్తుతం నియామకం అయిన పాఠశాల వివరాలు సమర్పించాలి
15  Transfers నందు గతంలో పని చేసిన పాఠశాల close చేయబడి,ఇప్పుడు ఎంచుకొనుటకు రావడం లేదు.   పాఠశాలల డ్రాప్ డౌన్ నుండి Others అని ఎంచుకొని సంబంధిత పాఠశాల వివరాలు సమర్పించవచ్చు.
16  ASO/APO తదితర సిబ్బంది తమ TIS వివరాలు ఎలా సమర్పించాలి?  త్వరలో తగు చర్యలు తీసుకోబడును. వివరాలు తెలుపబడును
17  ఎవరైనా నూతనంగా విధులలో చేరినట్లు అయితే వారిTIS వివరాలు ఎలా సమర్పించాలి?  నూతనంగా చేరిన వారు, ఫేసియల్ రికగ్నిషన్ యాప్ నందు నమోదు కాగానే వారికి TIS లాగిన్ ఎనేబుల్ అవుతుంది
18  ఈ వివరాలు సమర్పించిన తదుపరి చర్య ఏమిటి?  ఉపాధ్యాయుని యొక్క డ్రాయింగ్ ఆఫీసరు లాగిన్ కి ఈ ప్రొఫైల్ చేరవేయబడును.వారు మీయొ రిజిస్టర్ లోని వివరాలతో మీరు వారు మీయొక్క సర్వీసు సమర్పించిన వివరాలు సరిపోల్చి,అవసరం అయితే తగు మార్పులు చేసి Confirmation చేస్తారు.
19  సాంకేతికంగా ఏవైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?  మండల పరిధిలో అయితే MEO/MIS Coordinator/డేటా ఎంట్రీ ఆపరేటర్.
జిల్లా స్థాయి లో అయితే IT CELL
20  సర్వీసు సమస్యలు, వివిధ తేదీల నిర్ధారణ లో సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?  మీ DDO, తదుపరి AD (services) ఆపై మీ జిల్లా విద్యాశాఖాధికారి.


Download PDF Copy
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...