TIS FAQs Doubts-Clarifications 2026, TIS Updation Frequently Asked Questions
| S.No | ||
| 1 | TIS ఏ ఉపాధ్యాయులు పూర్తి చేయాలి? | ప్రైవేటు అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ తప్ప అందరూ |
| 2 | TIS లో ఏ పాఠశాల నమోదు చేయాలి? | జీతం తీసుకునే పాఠశాల. |
| 3 | హెల్త్ కార్డులో డిపెండెంట్‌లు లేకపోతే ఏమి చేయాలి? | డిపెండెంట్ లు సంఖ్య దగ్గర సున్నా ఎంటర్ చేసి ముందుకు వెళ్ళవచ్చు |
| 4 | CFMS ID నమోదు తప్పనిసరా? | రెగ్యులర్ ఉపాధ్యాయులకి ఇది తప్పనిసరి. కాంట్రాక్టు తదితరులకు ఇది ఐఛ్ఛికము.. |
| 5 | హెల్త్ కార్డు లో డిపెండెంట్ లు అదనంగా చేర్చ వలసి వస్తే? | డిపెండెంట్‌ల సంఖ్యను నమోదు చేసి, Add బటన్ ద్వారా వారి వివరాలు నమోదు చేయాలి. |
| 6 | భార్యాభర్తలు లో ఒకరికే హెల్త్ కార్డు ఉంటుంది. రెండవ వ్యక్తి ఏమి చేయాలి? | ఉన్న హెల్త్ కార్డ్ నంబర్‌ను నమోదు చేసి, డిపెండెంట్‌ల సంఖ్య 0 చూపించి పూర్తి చేయాలి. |
| 7 | డిగ్రీ వివరాలలో Add మరియు Remove బటన్ లు ఉపయోగం ఏమిటి? | Add బటన్ ద్వారా మనకి ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని వరుసలు వచ్చేలా సృష్టించుకొని వివరాలు సమర్పించవచ్చు. Remove బటన్ ఉపయోగించి అనవసరంగా సృష్టించిన వరుసలు రద్దు పరచవచ్చు |
| 8 | విద్యా వివరాలలో ప్రతిచోటా కొన్ని ఖాళీలు కనబడుతున్నాయి. ఎందుకు? | అవును. కొత్తగా కొన్ని వివరాలు అడగడం జరిగింది. అవి సమర్పించవలసి ఉంటుంది |
| 9 | విద్యా వివరాల వద్ద సమర్పించిన వివరాలు ఉన్నప్పటికీ,NO అని సెలక్షన్ చేసుకొంటే ఏమవుతుంది? | ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఉన్న డేటా డేటా తీసివేయబడును తీసివేయ అని ఒక పాప్-అప్ లో అడగబడును. మీరు Yes అని ఎంచుకొంటే గతంలో ఆ అర్హత పరంగా ఉన్న వివరాలు తొలగించబడతాయి. అవసరం అనుకొంటే తిరిగి మరల వివరాలు సమర్పించాలి. |
| 10 | కొంతమందికి కొన్ని అర్హతల వద్ద వివరాలు పునరావృతం అయ్యాయి.ఏమి చేయాలి? | పునరావృతం అయిన వివరాలు Remove బటన్ ద్వారా తొలగించవచ్చు |
| 11 | డిగ్రీ సింగిల్ సబ్జెక్టు వారు ఎక్కడ నమోదు చేయాలి? | సాధారణ డిగ్రీ నందు మూడు ఐఛ్చికాలు నమోదు చేయవలెను. కావున చివరన ఉన్న Other degrees అనే విభాగంలో నమోదు చేయవచ్చు. |
| 12 | డిగ్రీ నందు విద్వాన్ తదితరాలకు ఒకటే ఐఛ్ఛికం ఉంటుంది. వారు ఏమి చేయాలి? | అటువంటి కోర్సులకు ఒక ఐఛ్చికం తప్పనిసరి మరియు మిగిలనవి ఐఛ్చికంగా వెసులుబాటు ఇవ్వబడును |
| 13 | Appointment window నందు present school details 25 అవడం లేదు? | ఈ విభాగపు వివరాలు Transfers window లో ప్రస్తుత పాఠశాల రికార్డు నుండి ఆటోమేటిక్ గ వచ్చేలా చేయడం జరిగింది. కావున ఎడిట్ ఉండదు |
| 14 | Transfers వివరాలు నందు ఇంతవరకు బదిలీ కాని ఉపాధ్యాయులు ఏమి చేయాలి? | ప్రస్తుత పాఠశాల వివరాలు ఈ టేబుల్ నుంచే తీసుకోబడును.కావున “1 "వేసి, GO నొక్కి ప్రస్తుతం నియామకం అయిన పాఠశాల వివరాలు సమర్పించాలి |
| 15 | Transfers నందు గతంలో పని చేసిన పాఠశాల close చేయబడి,ఇప్పుడు ఎంచుకొనుటకు రావడం లేదు. | పాఠశాలల డ్రాప్ డౌన్ నుండి Others అని ఎంచుకొని సంబంధిత పాఠశాల వివరాలు సమర్పించవచ్చు. |
| 16 | ASO/APO తదితర సిబ్బంది తమ TIS వివరాలు ఎలా సమర్పించాలి? | త్వరలో తగు చర్యలు తీసుకోబడును. వివరాలు తెలుపబడును |
| 17 | ఎవరైనా నూతనంగా విధులలో చేరినట్లు అయితే వారిTIS వివరాలు ఎలా సమర్పించాలి? | నూతనంగా చేరిన వారు, ఫేసియల్ రికగ్నిషన్ యాప్ నందు నమోదు కాగానే వారికి TIS లాగిన్ ఎనేబుల్ అవుతుంది |
| 18 | ఈ వివరాలు సమర్పించిన తదుపరి చర్య ఏమిటి? | ఉపాధ్యాయుని యొక్క డ్రాయింగ్ ఆఫీసరు లాగిన్ కి ఈ ప్రొఫైల్ చేరవేయబడును.వారు మీయొ రిజిస్టర్ లోని వివరాలతో మీరు వారు మీయొక్క సర్వీసు సమర్పించిన వివరాలు సరిపోల్చి,అవసరం అయితే తగు మార్పులు చేసి Confirmation చేస్తారు. |
| 19 | సాంకేతికంగా ఏవైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? | మండల పరిధిలో అయితే MEO/MIS Coordinator/డేటా ఎంట్రీ ఆపరేటర్. జిల్లా స్థాయి లో అయితే IT CELL |
| 20 | సర్వీసు సమస్యలు, వివిధ తేదీల నిర్ధారణ లో సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి? | మీ DDO, తదుపరి AD (services) ఆపై మీ జిల్లా విద్యాశాఖాధికారి. |