TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 4 September 2023

AP Open School 10th, Inter Public Exams April 2024 Fee Payment Schedule

AP Open School 10th, Inter Public Exams March 2024 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, March -2024 Examination Fee Collection Schedule APOSS SSC, Inter Public Exams March 2024 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, March 2024 Examination Fee Payment Schedule, Instructions APOSS Public Examinations, March 2024 SSC & Intermediate EXAMS FEE SCHEDULE APOSS SSC & Intermediate Public Examinations, March 2024 Examination Timetable and schedule of exam fee collection


పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చ్ 2024 పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:


గమనికలు:


పరీక్ష ఫీజు కట్టుటకు అర్హతలు:

  • 2023-24 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది. 31.08.2023 నాటికి యస్.యస్.సి. అభ్యర్థులు 14 సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం॥ వయస్సు నిండినవారు మాత్రమే పరీక్షఫీజు చెల్లించుటకు అర్హులు.
  • ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్థులు.
  • ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు

పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా చెల్లించవచ్చును. డి.డి/ చలానా రూపములో స్వీకరించబడదు. మరియు, APOSS website: www.apopenschool.ap.gov.in పొందు పరచబడిన, 'పేమెంట్ గేట్వే ద్వారా, కూడా పరీక్ష రుసుమును, నెట్ బ్యాంకింగ్, డెబిట్ /క్రెడిట్ కార్డులతో, సెలవు దినములతో సహా ఎల్లవేళలా (24/7), చెల్లించవచ్చును. ఎ.పి. టి. ఆన్ లైన్ / పేమెంట్ గేట్వే' ద్వారా చెల్లించిన పరీక్ష రుసుము రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.


దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్షులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి. ఆన్ లైన్/ పేమెంట్ గేట్వే', నందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి. ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి, తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.


ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును.


పీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు.పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.


కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.


ఏదేని కారణముచే పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరితేదిని ప్రభుత్వమువారు సెలవుదినముగా ప్రకటించినచో, ఆ మరుసటి రోజు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును.


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును. మరియు చెల్లించిన పరీక్ష రుసుమువాపసు ఇవ్వబడదు.


APOSS 10th, Inter Fee Payment Schedule 2024

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...