APRS 6th, 7th & 8th backlog Admissions 2022-23 Notification, Apply Online APRS Class 6th, 7th & 8th Admissions 2022-23 Notification, Online Application Andhra Pradesh Residential Schools Filling up of Backlog vacancies into Class 6th, 7th & 8th in certain APR Schools for the academic year 2022-23 through Automated Random Selection Method.
Following is the tentative schedule for Backlog Admissions in Classes 6th, 7th & 8th:
Sl. No |
Description |
Schedule |
1 |
Issue of Press Note to News papers |
11-06-2022 |
2 |
Opening for submission of ICR Application through Online |
15-06-2022 |
3 |
Last date for receipt of Online applications by APCFSS |
30-06-2022 |
4 |
Date for Automated Random Selection |
05-07-2022 |
5 |
Placing of School wise Selection lists on Society portal |
06-07-2022 |
2022-23 విద్యా సంవత్సరానికి 6,7,8 తరగతులలో లభ్యమగు ఖాళీలలో ప్రవేశము కొరకు మార్గదర్శకాలు:
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న పాఠశాలలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో సాధారణ (General) గురుకుల పాఠశాలలలో మరియు మైనారిటీ (Minority) గురుకుల పాఠశాలలల్లో వివిధ రిజర్వేషన్ కేటగిరీలలో లభ్యమగు ఖాళీలను నింపుటకు ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి (లాటరీ పద్ధతి) ద్వారా తేది 05-07-2022 న ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.
1. ప్రవేశానికి అర్హతలు:
6వ తరగతి ప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి ఉండాలి.
7వ తరగతిప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి..
8వ తరగతి ప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2010 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2006 నుండి 31.08.2010 మధ్య పుట్టి ఉండాలి.
ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగినవారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
పాఠశాలలో ప్రవేశం:
1. 2022-23 విద్యా సంవత్సరమునందు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ, ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ (లాటరీ పద్ధతి) ద్వారా, ఎంపిక చేయబడిన అధికారులతో కూడిన కమిటీ సమక్షంలో జరుపబడును.2. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశములు పాత జిల్లాల స్థానికత ఆధారముగా కల్పించబడును. ఒక జిల్లా లోని సాధారణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లా (పాత జిల్లా) లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
3. ఒక జిల్లా లోని సాధారణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లా (పాత జిల్లా) లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
4. ఒక మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా పట్టిక (2) లో తెలిపిన విధముగా అర్హులు.
5. సాధారణ పాఠశాలల్లో సంబంధిత క్యాటగిరిలో మిగిలివున్న సీట్లు సంబంధిత జిల్లాలకు (పాత జిల్లాలు) చెందిన ఆయా క్యాటగిరి అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడును. సంబంధిత పాఠశాలల్లో క్యాటగిరి వారీగా ఖాళీల వివరాలు పట్టిక - 1 నందు ఇవ్వబడినవి.
6. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో గల సీట్లు అర్హతగల జిల్లాల(పాత జిల్లాలు) అన్ని మైనారిటీ, యస్.సి మరియు యస్.టి అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడును.
2. ఏదేనీ ఒక రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు. కానీ మైనారిటీ పాఠశాలలకు చెందిన ఖాళీలను మైనారిటీ అభ్యర్థులతో మాత్రమే నింపుతారు.
3. EWS రిజర్వేషన్ 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయుచున్నందున మరియు ప్రస్తుత 6,7,8 తరగతులలో లభ్యమగుచున్నవి బ్యాక్ లాగ్ ఖాళీలు కావున వీటికి EWS రిజర్వేషన్ లభ్యం కాదు.
4. ప్రత్యేక కేటగిరిలకు సంబంధించిన అంగవైకల్యం, అనాధ మరియు సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో అట్టి ఖాళీలను మెరిట్ ప్రాతిపదికన ఓపెన్ క్యాటగిరి వారికి కేటాయిస్తారు.
5. జిల్లాలవారీగా వివిధ రిజర్వేషన్ కేటగిరీలలో ఖాళీలు లభ్యమగు సాధారణ మరియు మైనారిటీ గురుకుల పాఠశాలల వివరాలు, ఆయా పాఠశాలల్లో ప్రవేశానికి అర్హతగల జిల్లాల వివరాలు పట్టిక (1) మరియు పట్టిక (2) నందు ఇవ్వబడినవి.
6. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు కానిచో, అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.