WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 26 January 2022

New Districts in AP

New Districts in AP AP New Districts 26 New Districts / Head Quarters in AP 

REVENUE (DISTRICT ADMINISTRATION) DEPARTMENT RE-STRUCTURING/ FORMATIONS OF DISTRICTS PRELIMINARY NOTIFICATION.

Under sub-section (5) of section 3 of the Andhra Pradesh Districts (Formation) Act, 1974 (Act No.7 of 1974), notice is hereby given to all the concerned, that the Government in the interest of better administration and development of the areas concerned proposes to form a new Districts/Revenue Divisions as setout the schedule hereto appended to diminish the areas of/alter the boundaries of the District/Revenue Division as detailed in Schedule here. to appended.

Objections or suggestions are invited on the above proposal from all persons residing within the District who are likely to be affected thereby for being taken into consideration by the Government.

All objections or suggestions should be in writing in English or Telugu and should be addressed to the Collector (by designation) within whose jurisdiction the area lies so as to reach the office of the Collector on or before the expiry of thirty (30) days from the date of notification.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. 

రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

* జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి.

* ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక అందజేసింది.

కొన్నింటికి పాత పేర్లే

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా... ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాతపేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్‌, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేయనున్నారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేయనున్నారు.

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాల వ్యావహారిక నామాలతో ఏర్పాటు చేయనున్నారు.

కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.

చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన బాలాజీ జిల్లాలోకి తెచ్చారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చారు.

 మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్‌ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.

ఈ మార్పులు, చేర్పుల వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి 8 శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే, కొన్ని జిల్లాలు ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటవుతున్నాయి. 

8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు:

ఒంగోలు (బాపట్ల పరిధిలోని సంతనూతలపాడును ఒంగోలులో కలిపారు), కర్నూలు (నంద్యాల పరిధిలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోకి తెచ్చారు), శ్రీకాకుళం (విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపారు), అనంతపురం జిల్లాలో ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు, రాప్తాడు చేర్చారు.

6 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు:

నంద్యాల (దీని పరిధిలోని పాణ్యంను కర్నూలులో కలిపారు.), విశాఖపట్నం (దీని పరిధిలోని ఎస్‌.కోటను విజయనగరంలో కలిపారు.) 

భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం, పూర్తి గిరిజన జనాభాతో కూడిన అరకు లోక్‌సభ స్థానాన్ని రెండుగా విభజించి, రెండు జిల్లాలు చేశారు. అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు. 

అరకుని జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు. వాటిలో అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 

పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో నాలుగే అసెంబ్లీ స్థానాలున్నాయి. 

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిగా ఏర్పాటవుతున్న జిల్లాకి... జిల్లా పేరుగానీ, జిల్లా కేంద్రంగానీ రాజంపేట కాదు. జిల్లా పేరు అన్నమయ్యగా పెట్టారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయనున్నారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరుతుంది.బాపట్లలో రెండు రెవెన్యూ డివిజన్లు కొత్తవే.జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు.జనాభా పరంగా (2011 జనాభా లెక్కలు) 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల అతి తక్కువ జనాభా ఉంది.
*క్రొత్త జిల్లాలు : AP*

1) *జిల్లా: శ్రీకాకుళం*

ముఖ్య పట్టణం: శ్రీకాకుళం

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు

2) *జిల్లా పేరు: విజయనగరం*

జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మొత్తం మండలాలు 26
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు

3) *జిల్లా పేరు: మన్యం*

జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10) మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

4) *జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు*              

జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

5) *జిల్లా పేరు: విశాఖపట్నం*

జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు

6) *జిల్లా పేరు: అనకాపల్లి*

జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

7) *జిల్లా పేరు: తూర్పుగోదావరి*

జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

8) *జిల్లా పేరు: కోనసీమ*

జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

9) *జిల్లా పేరు: రాజమహేంద్రవరం*

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

10) *జిల్లా పేరు: నరసాపురం*

జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11) *జిల్లా పేరు:పశ్చిమగోదావరి*

జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

12) *జిల్లా పేరు: కృష్ణాజిల్లా*                               

కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

13) *జిల్లా పేరు: ఎన్టీఆర్‌* 

జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

14) *జిల్లా పేరు: గుంటూరు*

జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

15) *జిల్లా పేరు: బాపట్ల*

జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

16) *జిల్లా పేరు: పల్నాడు*

జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17) *జిల్లా పేరు: ప్రకాశం*

జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

18) *జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు* 

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19) *జిల్లా పేరు: కర్నూలు* 

జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

20) *జిల్లా పేరు: నంద్యాల*

జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

21) *జిల్లా పేరు: అనంతపురం*

జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22) *జిల్లా పేరు: శ్రీసత్యసాయి*

జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23) *జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప*

జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24) *జిల్లా పేరు: అన్నమయ్య*

జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25) *జిల్లా పేరు: చిత్తూరు*

జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26) *జిల్లా పేరు: శ్రీ బాలాజీ*

జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

Download New Districts in AP Gazette Notification using links given below


Download All Districts Gazette Notifications in single pdf
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...