WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 30 September 2021

NEP 2020 - NIOUN BHARATH - FLN Implementation Guidelines, FLN Hand Book

NEP 2020 - NIOUN BHARATH - FLN Implementation Guidelines, FLN Hand Book

మెమో సంఖ్య: S S 15021/18/2021  తేది: ౩౦-09-2021

విషయం: సమగ్ర శిక్షా - ఆంధ్ర ప్రదేశ్ - సీమ్యాట్ - జాతీయ విద్యా విధానం 2020 - నిపుణ్ భారత్ (NIPUN Bharath) - ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి మిషన్ అమలు-మార్గదర్శకాలు - ఉత్తర్వులు జారి చేయుట గురించి. 

సూచిక: 

1.డి.ఒ. లేఖ సంఖ్య 01-08-2021-IS, 14, తేది: 29.06.2021, సెక్రెటరీ, స్కూల్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వశాఖ. భారత ప్రభుత్వం నుండి. 
2. జి. ఒ.ఆర్ టి సంఖ్య 200 తేది 23-8-2021, పాఠశాల విద్య, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. 
3. ఈ కార్యాలయ ఆర్.సి. సంఖ్య SS15021/18/2021/SAMO- SSA, తేది: 08, 09, 2021

రాష్ట్రంలోని పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానచార్యులకు తెలియజేయడమేమనగా భారత ప్రభుత్వం విద్యారంగంలో విశేషమైన మార్పులను ప్రతిపాదిస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశ అభివృద్ధిలో విద్య కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని బాలలందరికీ ఉన్నత విద్యావకాశాలు కల్పించాలంటే ప్రాథమిక విద్యను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఇందుకోసం "నిపుణ్ భారత్ (%NIPUN Bharath --National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy%) అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం GSR INFO-www.gsrmaths.in చుట్టింది. దీనిలో భాగంగా 2026-27 నాటికి మూడో తరగతి పూర్తి అయ్యేసరికి బాలలందరికీ భాష, గణితంలలో పునాది అభ్యసనం కల్పించడం తక్షణ అవసరం అని గుర్తించారు. దీనికోసం భాష, గణితంలో పునాది అభ్యసనం (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి) అనే జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీని అమలులో భాగంగా జాతీయస్థాయిలో ఎఫ్.ఎల్.ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి) మిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ పాఠశాల స్థాయిలోనూ ఎఫ్.ఎల్.ఎన్ మిషన్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య. 200, తేదీ 23-8-2021, అనుసరించి బాల వాటిక, ఒకటవ తరగతి, రెండవ తరగతి, మరియు మూడవ తరగతి చదువుతున్న బాలలకు భాష, గణితంలలో పునాది అభ్యసనాన్ని అందించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం అమలు జరుగుతుంది. కాబట్టి పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, జిల్లా సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానచార్యులకు తెలియజేయడమేమనగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసి మిషన్ అమలులో భాగంగా ఈ క్రింది సూచనలను అమలుపరచాలి.

 2022 సంవత్సరానికి సంబందించిన 'అవగాహనతో చదవడం - నైపుణ్యం సాధించటం' (NIPUN Bharath- Na tional Initiative for Proficiency in Reading with Understanding and Numeracy) కార్యక్రమం అమలు కోసం, జిల్లా, మండల మరియు పాఠశాల స్థాయిలలో ఏర్పాటు చేసిన భాష, గణితంలో పునాది అభ్యసన (FLN) మిషన్ల ద్వారా మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో ప్రచారం చేయుట.

భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) మిషన్ కార్యాచరణ అమలుకు, లక్ష్యాల పురోగతిని పర్యవేక్షించడానికి, మండల వనరుల కేంద్రాలు (MRCs) మరియు సముదాయ వనరుల కేంద్రాలు (CRCs) కేంద్ర బిందువుగా పనిచేస్తాయి. దీనితో పాటుగా భాష, గణితంలో పునాది అభ్యసనం యొక్క సమగ్ర నాణ్యతకు, మెరుగుదలకు ప్రణాళికను రూపొందించాలి.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు 'భాష గణితంలో పునాది అభ్యసనం' యొక్క లక్ష్యాన్ని సాధించే దిశగా బోధనా లక్ష్యాలకు, ఉపాధ్యాయుల సామర్థ్య నిర్మాణానికి నాయకత్వ బాధ్యత స్వీకరించాలి.

అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను మరియు వనరులను సద్వినియోగం చేసుకుని పాఠశాల స్థాయిలో భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) ని విజయవంతంగా అమలు చేయాలి. దీనికి గాను ప్రతి పాఠశాల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి సంబంధిత జిల్లా విద్యాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానచార్యులు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగిన సూచనలు జారీ చేయాలి. 

ప్రతి పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుల సహకారంతో నెలవారీ విద్యా వార్షిక ప్రణాళికలను రూపొందించుకుని దాని ప్రకారం ఉపాధ్యాయులు తమ తరగతి గది కార్యాచరణ ద్వారా అభ్యసన ఫలితాలపై కృషిచేయాలి. 

మొత్తం పాఠశాల విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం మరియు సుస్థిరతను పెంపొందించడానికి, బోధనా అభ్యసన ప్రక్రియలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ (PC) చురుకుగా పాల్గొనాలి.

భాష, గణితంలో పునాది అభ్యసన లక్ష్యాల పట్ల అవగాన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయటానికి జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు (FLN) కార్యకలాపాల జాబితాను అనుసరించి అన్ని పాఠశాలల్లో 'పాఠశాల సంసిద్ధతా మేళా/వేడుకలు' (1వ తరగతి లో ప్రవేశించే పిల్లల తల్లుల కోసం) నిర్వహించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి.

(FLN) కార్యకలాపాల అమలుకు అవసరమైన బోధనాభ్యసన ప్రక్రియలు మరియు అభ్యసన ఫలితాలపై స్పష్టమైన అవగాహనతో ప్రతి పాఠశాల ఒక రోడ్ మ్యాప్ (2021-27) ను సిద్ధం చేయాలి. ఈ దీర్ఘకాలిక ప్రణాళికను అనుసరించి జిల్లాలు మరియు రాష్ట్ర వార్షిక ప్రణాళికలను రూపొందించి అమలుచేయాలి. భాష, గణితంలలో పునాది అభ్యసనం (FLN) అభ్యసన పలితాల అమలు కోసం ప్రణాళిక సిద్ధంచేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభంలో, మధ్యలో మరియు ముగింపులో నిర్వహించవలసిన మదింపు విధానాలు, ప్రగతి నివేదికలు, ట్రాకర్ మొదలైన సాంకేతిక సాధనాల గురించిన అవగాహన పొంది వుండాలి.

జిల్లావిద్యా శాఖాధికారులు, జిల్లా సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణా సంస్థల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల్లో భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) కార్యకలాపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. అభ్యసఫలితాల సాధనకు తోడ్పడే కార్యక్రమాలను అమలు చేయడానికి, దీర్ఘకాలిక సహకారం అందించటానికి నిబద్ధతను కలిగి ఉండాలి.

భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) ను పాఠశాలల్లో అమలుపరచడానికి అభ్యసన ఫలితాలవారీగా చేయవలసిన కార్యకలాపాలను ఉపాధ్యాయులకు అందజేయాలి.

భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) ను పాఠశాలల్లో అమలుపరచడానికి బాలానందం, 1, 2, 3 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులకు 'దీక్ష' ద్వారా శిక్షణ పొందేలా చూడాలి.

 కావున అందరు ప్రాంతీయ సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, జిల్లా సమగ్ర శిక్షా అదనపు పథక సంచాలకులకు, జిల్లా విద్యా శిక్షణ సంస్థల ప్రధానచార్యులకు తెలియజేయడమేమనగా అనుబంధంలో ఇచ్చిన భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) మార్గదర్శకాల కరదీపికను అన్ని ప్రాథమిక పాఠశాలలకు అందించి కార్యక్రమ అమలుకు చర్యలు చేపట్టవలసినదిగా కోరడ మైనది.

అనుబంధం: భాష, గణితంలో పునాది అభ్యసనం (FLN) మార్గదర్శకాల కరదీపిక

Download orders | Download FLN Hand Book

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...