TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 3 July 2020

UDISE+ 2019-20 Latest Guidelines to update details before 13.07.2020

పాఠశాల విద్య - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - యూడైస్ + పోర్టల్లో పాఠశాల వివరాలు - కొన్ని వివరాలు మరియొకసారి సరిచూసుకుని అప్ డేట్ చేయడం విషయమై మార్గదర్శకాలు - జారీ మెమో: ఆర్.సి.నం: ఐటీ/2020/సీఎస్ఈ తేది: 03.07.2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న వివిధ ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలల మరియు ఉన్నత పాఠశాలల వివరాలు యూడైస్+ ద్వారా పాఠశాల విద్యాశాఖ సేకరిస్తున్నారు.
 విద్యా సంవత్సరానికి గాను ఆ విధంగా సేకరించిన వివరాల్లో కొన్ని పాఠశాలలు కొన్ని వివరాలను సరిగ్గా అప్లోడ్ చేయని విషయం కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారి దృష్టికి వచ్చింది. కాబట్టి అందరు ప్రాంతీయ విద్య సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులకు మరియు అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఇందునిమిత్తమై తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా ఇందువెంట ఆదేశించడమైనది.
.
వారు ఈ సందర్భంగా ఈ కింది సూచనలు దృష్టిలో పెట్టుకొనవలసినదిగా కోరడమైనది: 
  • ఏ పాఠశాలకు సంబంధించిన యూడైస్ + వివరాలను ఆయా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే అప్ డేట్ చేయాలి. ఆయా ప్రధానోపాధ్యాయులకు ఆ విషయంలో సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ఎం ఎస్ కోఆర్డినేటరు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సహకరించాలి.
  • ఒక్క విద్యార్థి కూడా ఎస్ రోల్ మెంట్ లేని పాఠశాలను ప్రత్యేకంగా పరిశీలించాలి. అటువంటి పాఠశాలలు ఇప్పటికే మూసివేయబడి ఉంటే వాటిని యూడైస్ పోర్టల్ నుంచి తొలగించాలి.
  • విద్యార్థులకు సంబంధించి తదితర వివరాలన్నీ నమోదు చేసి, ఉపాధ్యాయుల వివరాల మాత్రం నమోదు చేయని పాఠశాలలు కూడా ఉన్నాయి. అటువంటి పాఠశాలల ఉపాధ్యాయులు వేరే పాఠశాలల నుంచి వర్కు అడ్జెస్టుమెంట్ మీద పని చేస్తున్న వారి వివరాలను 2019-20లో వారు ఏ పాఠశాలలో పనిచేస్తున్నారో ఆ పాఠశాల దగ్గర వారి వివరాలను చూపించాలి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు:
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పాఠశాల అడ్మిషన్ రిజిస్టర్లో పూర్తి వివరాలతో నమోదు చేయనట్లయితే ఆ వివరాలను తక్షణమే నమోదు చేయాలి.
  • వైఎస్సార్ కంటి వెలుగు' కార్యక్రమంలో జరిగిన పరీక్షలలో భాగంగా ఎవరైనా విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు ఉంటే వారి వివరాలు తప్పనిసరిగా సీడబ్ల్యూఎస్ఎస్ లో నమోదు చేయాలి.
  • భవిత కేంద్రాల్లో సేవలు పొందుతున్న విద్యార్థులు ఉన్నట్లయితే వారిని కూడా పాఠశాలలో తప్పనిసరిగా నమోదు చేయాలి.
  • ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పాఠశాలలో ప్రవేశాలు నిరాకరిస్తున్నట్లుగా కూడా కొన్ని కేసులు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చాయి. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి.
పారిశుద్ధ్య గదులు (టాయిలెట్లు):

పాఠశాలలో బాలురకు, బాలికలకు ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య గదుల్లో ఎన్ని గదులు ఉపయోగకరంగా ఉన్నాయన్న వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం
అటువంటి వివరాలను ఉపాధ్యాయులు స్వయంగా పరిశీలించి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా నమోదు చేయాలి

గ్రంథాలయాలు:

పాఠశాలలో నిర్వహిస్తున్న గ్రంథాలయాలు రీడింగ్ క్లబ్బులు, రీడింగ్ కార్నర్లు వంటి వాటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి

ఉపాధ్యాయులకు శిక్షణ:
  • 2019-20 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు వివిధ వృత్యంతర శిక్షణ తరగతులకు హాజరయ్యారు.
  • అందులో ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి కాంప్రహెన్స్ లెర్నింగ్ ఎన్ హాన్సమెంట్ ప్రోగ్రాం (సీఎల్ ఏపీ), అలాగే స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో శిక్షణ తరగతులు, తదితర శిక్షణా కార్యక్రమాలకు ఉపాధ్యాయులు ఎన్ని రోజులు హాజయ్యారన్నది కచ్చితంగా నమోదు చేయాలి.
  • ఈ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఉపాధ్యాయుల వారీగా వివరాలను పూర్తిగా నమోదు చేయాలి.
  • మొత్తం వివరాలను నమోదు చేసిన తర్వాత ప్రధానోపాధ్యాయులు యూడైస్ + ఫార్మెటును మొదటి నుంచీ చివరిదాకా క్షుణ్ణంగా ఒక్కొక్క అంశం వారీగా సరిచూసుకోవాలి. ఆ విధంగా సరిచూసుకున్న తర్వాత ఆ ఫార్మెటును ప్రింటు తీసుకుని, సంతకం చేసి మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో అందజేయాలి.
  • ఈ వివరాలు నమోదు చేయడం కోసం యూడైస్ పోర్టల్ లింకును 03.7.2020 వ తేది నుంచి తెరవడం జరిగింది. ఈ వివరాలను 13.7.2020 తేదీలోపు అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు) పూర్తిగా నమోదు చేయాలి.
  • ఈ అంశాలపై ప్రధానోపాధ్యాయులకు కలిగే సందేహాలకు నివృత్తి చేయడానికి సమగ్ర శిక్షా కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్కును ఏర్పాటు చేయాలి. జిల్లా ఎంఐఎస్ కో ఆర్డినేటర్ చూసుకోమని ఆదేశాలు ఇవ్వాలి.
Download Memo
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...