TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 13 July 2020

Pustaka Nestam - Maintenance of School Library Guidelines to teachers, HMs

మెమో, నెం, SS-15024/79/2020-SAMO-SSA తేదీ: Approved Date.

విషయం - సమగ్ర శిక్షా - పాఠశాల గ్రంథాలయ నిర్వహణ- 'పుస్తక నేస్తం' కార్యక్రమం ఆస్తులు -ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు - సూచనలు జారీ

ఆదేశాలు: 
            రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, మండల విద్యా శాఖాధికారులకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా బాల సాహిత్యాన్ని పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తరఫునుంచి కథలు, సైన్సు, గణితం, విజ్ఞానం, బాలసాహిత్యం పుస్తకాలను పంపిణీ వేయనుంది. www.gsrmaths.in

2019-20 విద్యా సంవత్సరానికి గానూ 'భారతీయ భాషాధ్యయన కేంద్రం మణుగూరు' వారి నుంచి ప్రస్తుతానికి 82 పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందనున్నాయి. వాటిని విద్యార్థులకు చదివించి వారిలో పుస్తక పఠనాసక్తిని మేధస్సును పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

అయితే, కోవిడ్ - 19 మహమ్మారి సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ,పాఠశాల గ్రంథాలయ నిర్వహణలో భాగంగా 'పుస్తక నేస్తం' పేరిట సమగ్ర శిక్షా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పిల్లలకు బాల సాహిత్యాన్ని చదివించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇస్తుంది.

ప్రధానోపాధ్యాయులకు సూచనలు:

  • సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం నుంచి ప్రతి పాఠశాల పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు అందుతాయి.
  • అందిన పుస్తకాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాబితా (కేటలాగు) తయారు చేసుకోవాలి. వాటిని గ్రంథాలయ స్టాకు రిజిస్టరులో, కంప్యూటర్లో నమోదు చేసుకోవాలి.
  • పుస్తకాలు చించకుండా, మడత పెట్టకుండా జాగ్రత్తగా చదవమని పిల్లలకు చెప్పాలి.
  • ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆ పుస్తకాలు అదే విధంగ చూడాలి పాఠశాల గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం విద్యార్థులకు పుస్తక పఠనం ద్వారా శక్తి,
  • అభిరుచిని తల్లిదండ్రులకు తెలియజేయాలి
  • ఎవరికి ఏ పుస్తకం ఇచ్చారో, తేదీ, తిరిగి తీసుకున్న తేది తిరిగి తీసుకున్న రాసుకోమని చెప్పాలి.
  • ప్రతి విద్యార్థి పుస్తకం ఆందేలా తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ బాధ్యత వహించాలి.

విద్యార్థుల భాగస్వామ్యం:

  • కోవిడ్ 19 మహమ్మారి దృష్ట్యా ప్రతి విద్యార్థి తమ తమ ఇళ్లకు పుస్తకాలు తీసుకెళ్లి చక్కగా చేయాలి
  • ఇందులో కథ, నీతి, ఇతర విజ్ఞాన విషయాలు, బొమ్మలు వంటివి విద్యార్థులు గ్రహించాలి
  • విద్యార్థి ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివిన పుస్తకాన్ని తీసుకోవాలి చదివేలా తర్వాత మరో విద్యార్థి ఆ పుస్తకాన్ని ఇచ్చి ఎదుటి విద్యార్థి దగ్గర పుస్తకాన్ని తీసుకోవాలి.
  • ఆ విధంగా పాఠశాలలు తిరిగి తెరిచేదాకా విద్యార్థులు తాము తీసుకున్న పుస్తకాలు తమలో తాము సర్కులేట్ చేసుకోవాలి.
  • పాఠశాలలు తిరిగి తెరిచిన తరువాత ఆ పుస్తకాలు బాధ్యతగా పాఠశాలకు అప్పగించాలి.
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...