WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 30 July 2020

Jagananna Vidyakanuka Latest Guidelines to distribute student kits at field level

ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC-SSA తేది: 30-07-2020

విషయం: సమగ్రా 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు

నిర్దేశములు:
1,.ఆర్.సి.ఎం.SS-16021/3/2020-MIS SEC -SSA తేది: 16-07-2020
2.ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC - SSA తేది: 17-07-2020

ఆదేశములు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే

జగనన్న విద్యా కానుక లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాంలు, ఒక సిట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన సరుకును భద్రపరుచుట కోసం దిగువ సూచనలు ఆదేశించడమైనది మండల విద్యాశాఖాధికారులు మా దృష్టికి తీసుకొచ్చారు

సామగ్రి భద్రపరచుట గురించి GSRMATHS:

సప్లయిర్స్ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి కొన్ని మండల రిసోర్స్ కార్యాలయాల్లో సమీప స్కూల్ కాంప్లెక్సులలో భద్రపరిచేందుకు తగినంత స్థలం లేదన్న సమాచారం కొంతమంది సీఎంవో / మండల విద్యాశాఖాధికారులు మా దృష్టికి తీసుకొచ్చారు.

ఇందుకుగాను మండల రిసోర్సు కేంద్రానికి దగ్గరలో ఉన్న భద్రతా ప్రమాణాలు గల ప్రైవేటు పాఠశాలలో నైనా, జూనియర్ కళాశాల లోనైనా భద్రపరచవచ్చు

పై సూచన ప్రకారం కూడా సాధ్యం కాని పక్షంలో తాత్కాలికంగా అద్దె భవనాన్ని తీసుకుని అందులో భద్రపరచవచ్చు. ఆ భవనానికి అద్ది ప్రభుత్వం చెల్లిస్తుంది.

రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిసమగ్ర శిక అడిషనల్ ప్రాజెక్టు కో- ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

Download proceedings
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...