TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 24 December 2018

Ganithamitra Mathematics TLM Hand Book

నిత్య జీవితంలో లెక్కలు అత్యంత అవసరం. అటువంటి పాఠ్యాంశమంటే చాలామంది విద్యార్థులు భయపడతారు. గణితం చేయాలంటే అర్థంకాని తికమక పాఠాలుగా భావిస్తుంటారు. అర్థమయ్యే రీతిలో సులభంగా బోధిస్తే దానంతటి సులువైన పాఠ్యాంశం మరొకటి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక అలాంటి భయాలను పోగొట్టడానికి, విద్యార్థులకు సులభరీతిలో గణితం అర్థమయ్యేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలో 'గణితమిత్ర' పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన పరీక్ష, రాష్ట్రస్థాయి సాధన పరీక్షల వంటి వాటిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు గణిత ప్రక్రియల్లో వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు. ఐదో తరగతి పూర్తి చేసే నాటికి చతుర్విధ ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారంపై సరైన అవగాహన లేకుండానే ఆరోతరగతిలోకి 70 శాతం మంది వెళుతున్నట్లు గుర్తించారు. వీరిలో 50 శాతం కనీసం మూడో తరగతి స్థాయి లెక్కలు కూడా చేయలేకపోతున్నట్లు గుర్తించారు. ఇలాంటి వారి కోసం సరళంగా, సులభంగా, ఆసక్తికరంగా గణిత పాఠాలు నేర్చుకోవడానికి గణితమిత్ర దోహదపడుతుంది. 


మొదటి విడతగా దీన్ని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. 

కిట్‌లో ఏముంటాయంటే.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితంలోని బోధనాభ్యసన కృత్యాలు, పూసల చట్రం, అబాకస్‌, ఎక్కాలు, సులభంగా నేర్పడానికి, గుణిజాలు తెలపడానికి అభ్యసన సామగ్రి ఉంది. వివిధ ఆకారాలు, కాలం, పొడవు, బరువులకు సంబంధించిన ప్రక్రియలను సులభంగా అవగాహన చేసుకోవడానికి కృత్యాలు ఉండనున్నాయి. కారణాంకాలు, గుణిజాలు, సౌష్ఠవాలు, కొలజాడీ, లీటర్లు, మిల్లీమీటర్ల పాత్రలు తదితర సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు అభ్యసన సామగ్రి ఉంటుంది. త్వరలోనే వీరికి శిక్షణ ఇచ్చి ఈ కిట్లును అందించనున్నారు.
ఎన్నో ప్రయోజనాలు..మనోవైజ్ఞానిక నిపుణులు హెబ్సింగ్‌ హౌస్‌ తెలిపినట్లు ఉపాధ్యాయులు చెప్పడం, విద్యార్థులు వినడం ద్వారా 26 శాతం, చూడడం ద్వారా నేర్చుకునేది 74 శాతం గుర్తుంటుంది. దీన్ని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గణితమిత్ర కార్యక్రమానికి రూపకల్పన చేసి జీవో నంబరు 144 ద్వారా విద్యార్థులకు సులభంగా పాఠాల అర్థమవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా 87 ఆదర్శ పాఠశాలలకు ఈ కిట్లు పంపిణీ చేస్తున్నారు దీని ద్వారా పదివేల మంది లబ్ధి పొందనున్నారు. కిట్‌తో మంచి ఫలితాలు గణితమిత్ర కిట్‌ ద్వారా బోధన చేయడం సులభంగా ఉంటుంది. విద్యార్థులకు సులభంగా నేర్చుకోవటానికి కిట్‌ దోహదపడుతుంది.


బోధన సులువుగా ఉండటంతో విద్యార్థులు గణితమంటే ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ కిట్‌ ద్వారా లెక్కలను సులువుగా చేయడానికి వీలుంటుంది. మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Download Ganithamitra Mathematics TLM Hand Book
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...