TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 9 June 2017

AP Subject Forum-e-knowledge eXchange-Registration Process

 ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ANDHRA PRADESH SUBJECT FORUM అను పేరు మీద ఒక వెబ్సైట్ ను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా  సెప్టెంబర్ 4వ  తేదిన విజయవాడలో ప్రారంభించనున్నారు. ఈ వెబ్సైట్ రూపకల్పనలోను, దీనిని నిర్వహించుటలోను ఆంధ్రప్రదేశ్ లో గల ఉపాధ్యాయులు యావన్మందిని భాగస్వాములను చెయ్యాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు N.C.E.R.T భావిస్తున్నాయి. ఈ సందర్భంగా తేది 23.8.2016 మరియు 24.08.2016 తేదీలలో విశాఖపట్నంలో 6 (విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా) జిల్లాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులతో వర్క్ షాప్ నిర్వహించడం జరిగినది. ఈ వెబ్సైట్ నందు రాష్ట్రంలో గల ఉపాధ్యాయులు యావన్మంది సభ్యులుగా చేరాల్సివుంది. అదేవిధంగా ఆయా పాఠశాలల విద్యార్థులను కూడా ఇందులో చేర్చాల్సివుంది. ఇందులో సభ్యులుగా చేరినవారు విద్యాసంబంధిత సమాచారాన్ని, వీడియోలను, చిత్రాలను, పాఠ్యప్రణాళికలను, ప్రాజెక్టులను అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. కావున ఇందులో సభ్యులుగా నమోదు కావల్సిందిగా కోర్ గ్రూప్ సభ్యునిగా మిమ్మల్ని కోరుతున్నాను.


లాగిన్ అయ్యే విధానం:
 ➡http://111.93.8.43:8080 లేదా http://apekx.in అని టైప్ చేసి సదరు వెబ్సైట్ను ఓపెన్ చెయ్య్డండి. 

▶Teacher Zone అనే Tab ను క్లిక్ చెయ్యండి. 

▶అక్కడ New Teacher Registration Click Here అని వుంటుంది. అక్కడ క్లిక్ చెయ్యండి. 

 ▶Registration Type అనే వద్ద Teacher ను సెలెక్టు చెయ్యండి. 

▶ఫోన్ నెంబరు వద్ద మీ ఫోన్ నెంబరును (Teacher Information System కు ఇచ్చిన ఫోన్ నెంబరును) Enter చెయ్యండి.

▶అక్కడ కనిపించే Security Code (అంకెలు వుంటాయి) ను Enter చెయ్యండి. 

▶ఆ తరువాత Submit Button ను క్లిక్ చెయ్యండి.

▶ఒక విండో ఓపెన్ అవుతుంది. Teacher Information System లో మీరు నమోదు చేసిన వివరాలతో మీ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.

▶అందులో మీ ఫోటోను Upload చెయ్యండి.

▶మీ తండ్రి పేరు, మీ సబ్జెక్టు వివరాలను, మీరు ఏ అంశంలో నిష్ణాతులో మరియు మీ గురించి పరిచయ వాక్యాలను నమోదు చేసి Submit Button ను క్లిక్ చెయ్యండి.

▶ఇకపై మీ సబ్జెక్టులో గాని, లేదా ఇతర సబ్జెక్టులో గాని రాష్ట్రవ్యాప్తంగా మన ఉపాధ్యాయ మిత్రులు పోస్ట్ చేసిన విద్యాసంబంధిత అంశాలను తెలుసుకోవచ్చు. మీ అనుభవాలను, అనుభూతులను వారితో పంచుకోవచ్చు.

▶మీరు e-content ను తయారుచేసి ఇతర పాఠశాలల ఉపాధ్యాయులకు అందించవచ్చు.
 లాగిన్ అవ్వడం చాలా సులబంగా ఉంది. పొటో లాగిన్ సమయంలోనే కాక తర్వాత ఎప్పుఢైనా అప్ లోడ్ చేసేసౌకర్యం ఉంది. ఎక్స్ పర్ట్సు తమ అమూల్యమైన ఎక్స్ పెర్మెంట్సు ఇక్కడ అందరితో షేర్ చేసుకోవచ్చు.


>
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...