Home » » Rc 158 dt.04.06.16 SELECTION OF MANDAL ACADEMIC COORDINATORS-REVISED SELECTION PROCEDURE, EXAM PATTERN, DUTIES OF MAC AND APPLICATION FOR MAC WITH FULL DETAILS IN 8 PAGES

Rc 158 dt.04.06.16 SELECTION OF MANDAL ACADEMIC COORDINATORS-REVISED SELECTION PROCEDURE, EXAM PATTERN, DUTIES OF MAC AND APPLICATION FOR MAC WITH FULL DETAILS IN 8 PAGESమండలానికి ముగ్గురు చొప్పున నియామకం ➖
ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ

🔹ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలవైపు నడిపించడం.. ఇది ప్రభుత్వం ముందున్న సవాలు.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. తాజాగా పాఠశాలలపై పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. క్లస్టరుకో విద్యాసమన్వయకర్తను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, రూ. కోట్లు వెచ్చిస్తున్నా అవి తరగతి గదిలోని సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతున్న దాఖలాలు లేవు. ఇది పలు సర్వేలు చెప్పిన వాస్తవం. ప్రాథమిక స్థాయి విద్యార్థుల సామర్థ్యాలు మరీ తక్కువగా ఉంటున్నాయని చెప్పాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థిలో అభ్యసన స్థాయి పెంచడంతోపాటు, ప్రవేశాలు కూడా పెరగాలంటే సమన్వయకర్తలు ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది.

👉 *నియామకాలిల*

 మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒక సమన్వయకర్తను నియమించనున్నట్ల
ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమయింది. ఐదేళ్లు సర్వీసు నిండిన 40 ఏళ్లలోపు వయసున్న స్కూల్ అసిస్టెంట్లు మరియు SGT లు ఈ పోస్టుకు అర్హులు.

🔹అర్హత కలిగిన ఉపాధ్యాయులు తమ దరకాస్తులను జూన్ 9లోపు
 సమర్పించాలి. ఈనెల 11 న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులకు రాత పరీక్ష 75, మౌఖిక పరీక్ష 10, డెమోక్లాస్ 15 మార్కులకు ఉంటాయి.ఆంగ్లంలో మంచి పునాది, నైపుణ్యత, మాట్లాడగలిగే సామర్థ్యం, సీసీఈ, ఆర్.ఎం.ఎస్.ఎ, విద్యాహక్కుచట్టం తదితర అంశాలపై సమన్వయకర్తలకు అవగాహన కలిగి ఉండాలి. ఎంపిక కమిటీలో జిల్లా విద్యాశాఖాధికారి ఛైర్మన్, డీవైఈవో కన్వీనర్, ఎస్ఎస్ఏ పీవో, ఎం.ఇ.ఒ.హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు.

📃 *విధులేమిటో?*

ప్రస్తుతం పాఠశాలలపై పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంది. మండల విద్యాశాఖాధికారులు పాఠశాలలు పర్యవేక్షిస్తున్నా సమావేశాలు, ఇతర పని ఒత్తిడి కారణంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షణపై దృష్టి సారించలేకపోతున్నారు. అందుకే మండలానికి ఇద్దరుక ఎం.ఇ.ఒ.లు ఉండాలన్న డిమాండ్ను కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేశాయి. అందుకే సమన్వమకర్తలు ఎం.ఇ.ఒ.లకు తగిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో అభ్యసన స్థాయి పెంచడంతోపాటు ఉపాధ్యాయులకు తోడ్పాటునిస్తూ, తరగతి గదులను పర్యవేక్షించాలి. టీఎల్ఎం ప్రదర్శన ఉండేలా చూడలాంటి బాధ్యతలు ఉంటాయి.
తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై నివేదిక తయారు చేసి వారిపై  దృష్టి సారించి నిర్ణయించిన సమయంలో వారి సామర్థ్యం పెంచేలా చూడాలి.
తరగతి గదిలో ఉపాధ్యాయులకు సూచనలు చేయడంతోపాటు అందుబాటులోకి వస్తున్న సాంకేతికత చేరేలా చూడటం, బోధనాపరమైన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
విద్యార్థులు లేక వెలవెలబోతున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి కళకళలాడేలా చేయాలి. ఇలా అన్ని అంశాల్లో పర్యవేక్షిస్తూ అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు తోడ్పాటు అందిస్తూ ఎం.ఇ.ఒ.లకు సహాయ సహకారాలు అందించాలి.

💥*ఇవి లక్ష్యాలు*

తక్కువ సామర్థ్యాలతో ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గించడం
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతోపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించడం
తరగతిగదిలో బోధనతీరులో మార్పు తేవడం, ప్రతిభావంతంగా తీర్చిదిద్దడం.
ఉపాధ్యాయుల్లో బోధన సామర్థ్యం, నైపుణ్యం పెంచడం.
ఉపాధ్యాయుల మధ్య సత్ససంబంధాలు పెంచుతూ టీచింగ్ లెర్నింగ్ మాడ్యూల్(టీఎల్ఎమ్) అభివృద్ధి చేయడం
తరచుగా పాఠశాలలను పర్యవేక్షించి, ఎం.ఇ.ఒలకు విద్యాసమన్వయకర్తలతో సహాయం అందించి మండల స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం.

💥*ఫలితం దక్కేనా?*

ఇప్పుడు నియమిస్తున్న విద్యా సమన్వయకర్తల మాదిరిగా గతంలో ఎమ్మార్పీలను ఏర్పాటు చేశారు. ఎం.ఇ.ఒ.లకు తోడ్పాటుగా ఎమ్మార్పీలను, కాంప్లెక్స్ స్థాయిలో సీఆర్పీలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. అయితే మండల స్థాయిలో 20 పాఠశాలలకు ఒకరు చొప్పున ఎమ్మార్పీలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో RTE ACT అమలులో భాగంగా అప్పటి విద్యాశాఖ కమిషనర్ ఈ వ్యవస్థను రద్దు చేశారు. పాఠశాల నుంచి మండలానికి ఏ సమాచారం ఇవ్వాలన్నా ప్రధానోపాధ్యాయుడు వెళ్లాల్సి వస్తోంది. బోధనకు పరిమతమవ్వాల్సి ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా ఉన్నందున ఆ తరువాత సీఆర్పీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గతంలో ఉన్న ఎమ్మార్పీల మాదిరిగానే విద్యా సమన్వయకర్తలను ఏర్పాటు చేస్తున్నారు.


DOWNLOAD THE NEW PROCEEDINGS WITH FULL DETAILS

APPLICATION FOR MANDAoL ACADEMIC COORDINATORS