AP Open School APOSS Admissions 2026 Schedule, Apply Online APOSS SSC Inter Admission 2026-27 APOSS-SSC and Intermediate Courses-Admissions for the academic year 2026-27-Enrollment Drive APOSS SSC Inter Admission Schedule 2026-27 AP Open Schools Admissions Schedule APOSS SSC 10th Inter Admission 2026 Application Form, Eligibility AP Open School Admission SSC Inter Notification 2026-27 Online Apply Now APOSS - S.S.C & Intermediate courses - Admissions for the year- 2026-27 APOSS SSC Application Form, APOSS Inter Application Form, ap open school admission 2026-27 last date AP Open Schools Admissions into SSC / 10th Class and Intermediate Schedule Released.
School Education APOSS, Amaravati APOSS SSC and Intermediate Courses Admissions for the academic year 2026-2027 Wide Publicity for Admissions - Regarding RC No. 3251023/ADMIN/2026, Dated 04-06-2026
Ref: Note orders dated 13-05-2026 given by the Director of School Education, Andhra Pradesh, Amaravati.
All the District Educational Officers in the State are hereby informed that the notification for admission into S.S.C & Intermediate courses of A.P. Open School Society for the year academic year 2026-2027 has been issued as detailed below:
|
S.No. |
Item |
Dates |
|
1 |
Commencement of Admissions |
12.06.2025 |
|
2 |
Last date for submission of ONLINE application, fee payment with prescribed fee |
30.07.2025 |
Therefore, all the District Educational Officers and District Coordinators in the State are requested to issue Press/Media Note in their respective Districts for wide publicity among the learners and public so as to reach every nook and corner of the District with regard to Admissions into S.S.C & Intermediate courses of A.P.O.S.S for the Year 2026-27 and submit the press clippings to this office.
ఏ.పి. ఓపెన్ స్కూల్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) ద్వారా 2026-2027 విద్యా సంవత్సరంనకు సంభందించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తరగతులలో అడ్మిషన్ పొందడానికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠము (APOSS) సంచాలకులు వారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగినది. పదవ తరగతిలో చేరుటకుగాను 14 సంవత్సరాలు నిండిన వారికి మరియు ఇంటర్మీడియట్ చేరుటకుగాను పదవ తరగతి పాసై 15 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తులు చేయుటకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి www.apopenschool.ap.gov.in నందు 12.06.26 నుండి అవకాశం.
ప్రవేశం కొరకు వివరములు:
- అడ్మిషన్లు ప్రారంభ తేది: 12.06.2026
- అడ్మిషన్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి చివరి తేది: 30.07.2026
- అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేది: 31.07.202
- Rs. 200/- లేటు ఫీజుతో అడ్మిషన్లు ఆన్లైన్ లో చేయడానికి చివరి తేది: 01.08.2026 to 15.08.2026
ప్రవేశమునకు సూచనలు:
- దరఖాస్తు వివరముల నమూనా నింపబోయే ముందు ప్రాస్పెక్టస్ నందలి సూచనలన్ని జాగ్రత్తగా చదివి, విద్యార్హతలు, కనీస వయస్సు మొదలైన అర్హతల గురించి సంతృప్తి చెందవలెను. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులో పూర్తిచేయవలసిన అంశముల అవగాహన కోసం నమూనా దరఖాస్తు నింపవలెను.
- అభ్యాసకులు దరఖాస్తు చేసుకొనుటకు మరియు 30 రోజుల పి.సి.పి. (ముఖాముఖి) తరగతులకు హాజరయ్యేందుకు తమకు అనుకూలమైన అధ్యయన కేంద్రము (A.I.) ను ఎంపిక చేసుకోవచ్చును.
- ఒక అధ్యయన కేంద్రము నందు కనిష్ఠంగా నమోదు కావలసిన ఇంటర్మీడియట్ అభ్యాసకుల సంఖ్య సైన్సు గ్రూపు నందు 30 మరియు నాన్ సైన్సు గ్రూపు నందు 30, అంతకన్నా తక్కువగా A.I లో నమోదైనచో, సంబంధిత A.I. లోని అభ్యాసకులను అందుబాటులో ఉన్న మరియొక A.I. లోనికి సర్దుబాటు చేయబడును. అట్టి అభ్యాసకులు ముఖాముఖి తరగతులకు (P.C.Ps) సర్దుబాటు చేయబడిన అధ్యయన కేంద్రములకు మాత్రమే హాజరవ్వవలెను. దీనికి సంబంధించి ఎ.పి. ఓపెన్ స్కూల్ ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు అనుమతించదు.
- దరఖాస్తు సమర్పించడం నుండి ఫీచెల్లించి, ప్రవేశం నిర్ధారించు వరకు అన్ని దశలు ఆన్లైన్లో మాత్రమే అనుమతించబడును. ఆన్లైన్ కాకుండా మరి ఏ ఇతర విధానము ఎట్టి పరిస్థితులలోను అనుమతించబడదు.
రిజిస్ట్రేషన్ పద్ధతి:
- వ్యక్తిగతంగానైనా లేక ఎ.పి.టి. ఆన్ లైన్ కేంద్రము మరియు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారానైనా అభ్యాసకులు అన్ని దశల ప్రవేశ దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసుకొనవచ్చును.
- ఏదైనా కోర్స్ రిజిస్ట్రేషన్ కొరకు https://apopenschool. ap.gov.in వెబ్ సైట్ లోనికి ప్రవేశించి, అడ్మిషన్ పేజీ నందలి రిజిస్ట్రేషన్ బటన్ను క్లిక్ చేసి, INTERMEDIATE కోర్సును సెలెక్ట్ చేసుకొనవలెను. తదుపరి అభ్యాసకులు తమ మొబైల్ నెంబర్, పూర్తి పేరు, లింగం, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరుని నమోదు చేసి 'సబ్మిట్' చేయవలెను. సబ్మిషన్ ను విజయవంతముగా పూర్తిచేసిన తర్వాత వెబ్సైట్నందు గల Payment Gateway/APT ONLINE ద్వారా నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవలెను, తదుపరి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయుటకు మరియు అడ్మిషన్ ఫీజు చెల్లింపు పూర్తిచేయుటకు అభ్యాసకులకు సంక్షిప్త సమాచారము (SMS) ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ పంపబడును. పాస్ సర్టిఫికెట్లు డిజిలాకర్కు అనుసంధానమైనందున అభ్యాసకుని ఖచ్చితమైన ఆధార్ నెంబర్ను నమోదు చేయవలెను.
- అభ్యాసకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒకసారి రిజిస్ట్రేషన్కు మాత్రమే అంగీకరింపబడును.
- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినంతమాత్రాన ప్రవేశము, సీటు కేటాయించుట నిర్ధారణ అయినట్లు కాదు. ప్రవేశ నిబంధనలన్ని ఖచ్చితంగా పాటించినప్పుడు మాత్రమే ప్రవేశ నిర్ధారణ జరుగును.