TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 13 September 2024

PRASHAST App Registration, Screening Process

PRASHAST App Registration, Screening Process How to Register in Prashast App How to screen our school students in Prashast App How to Register in Prashast app as HOI Headmaster Principal, as Teacher and as Special Educator How to login How to assign Teachers in Prashast App Prashast app for Disability Screening Checklist for Schools How to use Prashast App?, Registration procedure, Verification of teachers by principals, HM for teachers, Assignment of classes, Screening to whom?  None of for all?, What questions are there in screening? Can we give None of Above for all in screening? Important things to note in Prashast App


ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం... ప్రశస్త యాప్ గురించి గూగుల్ మీటింగ్ జరిగిన విషయాలలో ముఖ్యమైనవి.


1) రిజిస్ట్రేషన్ విధానం:


ఉపాధ్యాయులు వారి యొక్క వ్యక్తిగత జిమెయిల్ లేదా యాహు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇప్పుడే మొదటిసారి రిజిస్ట్రేషన్ అయ్యే వారు New User అని login కావలెను. ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా వారి వ్యక్తిగత login తోనే టీచర్ గా registration కావలెను. ప్రధానోపాధ్యాయులు మాత్రం వారి UDISE లో గత సంవత్సరం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఉన్నారు దాని ద్వారా లాగిన్ అయితే మాత్రమే HM గా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉన్నది. అనగా Teacher అనే వారు ఒకసారి registration అయితే సరిపోతుంది. కానీ HM గారు మాత్రం వ్యక్తిగత email తో Teacher designation గానూ, UDISE లో  ఉన్న email & Principal/Head Master గానూ రెండు లాగిన్ లు కలిగివుంటారు. కావున ప్రధానోపాధ్యాయులు UDISE లో  యే ఇమెయిల్ లింక్ అయి ఉన్నదో లేదా గత సంవత్సరం ఏ ఈమెయిల్ ఉన్నదో ఒక్కసారి ప్రొఫైల్ లో చూసుకోవలెను. ఒకవేళ UDISE కి email లింక్ కాకపోయి వుంటే ఇప్పుడు udise లో అప్డేట్ చేయవలెను.


2) ప్రధానోపాధ్యాయులు టీచర్లను వెరిఫికేషన్ చేసే విధానం:


తదుపరి ప్రధానోపాధ్యాయులు UDISE లో ఉన్న ఈమెయిల్ తో లాగిన్ అయిన తర్వాత వారి ప్రధానోపాధ్యాయులు లాగిన్ లో Teachers అనే ఆప్షన్ లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన ఉపాధ్యాయుల వివరములు వచ్చిన ఉంటాయి. ఆ ఉపాధ్యాయులను వెరిఫికేషన్ చేయవలసి ఉంటుంది. కన్ఫామ్ చేయవలసి ఉంటుంది.


3) టీచర్లకు HM గారు Class లు Assign చేసే విధానం:


టీచర్స్ ను కన్ఫర్మ్ చేసిన తర్వాత వారికి Class లను Assign (కేటాయించవలసి) ఉంటుంది. అనగా ప్రధానోపాధ్యాయులు కూడా ఏదైనా ఒక తరగతిని క్లాస్ టీచర్ గా తీసుకోవలెను.


4) స్క్రీనింగ్ ఎవరికి చేయాలి? అందరికీ నా?


Note: క్లాస్ లను కేటాయించిన తర్వాత ఉపాధ్యాయులు వారి లాగిన్ లో గతంలో స్క్రీనింగ్ చేసి ఉంటే, 2023-24 లో స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల పేర్లు కనబడతాయి. ఆ విద్యార్థులను మరల స్క్రీనింగ్ చేయాల్సిన అవసరము లేదు. * పాఠశాల విడిచి వెళ్లిన విద్యార్థులను కూడా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గత సం ఆల్రెడీ స్క్రీనింగ్ చేసి ఉంటే, ఈ విద్యా సం. కొత్తగా అడ్మిషన్ పొందిన వారిని మాత్రమే "ADD STUDENT" అనే ఆప్షన్ ద్వారా పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్లాస్, సెక్షన్, ఎన్రోల్మెంట్ id (PEN number) తదితర వివరాలు ఎంటర్ చేసి add చేయవలెను. వారికి మాత్రమే స్క్రీనింగ్ చేయవలెను.ఒకవేళ గత సం విద్యార్థులకు ఎటువంటి స్క్రీనింగ్ చేయకపోతే అందరూ విహద్యార్థులను (పాఠశాల లో ఎన్రోల్ అయిన మొత్తం) Add student అనే ఆప్షన్ ద్వారా Add చేసుకుని స్క్రీనింగ్ -1 పూర్తి చేయవలెను


5) స్క్రీనింగ్ లో ఏ ఏ ప్రశ్నలు ఉంటాయి?


ప్రశస్థా యాప్లో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలోని ప్రతి ఒక్క విద్యార్థిని స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. ఇది కేవలం ప్రత్యేక అవసరాలు (CWSN) గల పిల్లల కోసం మాత్రమే అని కొంతమంది భావిస్తున్నారు. కానీ Normal student ని కూడా 63 ప్రశ్నల్లో ఏవైనా ఒక ప్రవర్తన మార్పు (Behavioural Changes) కు, DISABILIY కి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. మీ పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థిని ఆ తరగతి ఉపాధ్యాయులు (class techer) Screening -1 చేయాల్సి వుంటుంది.


6) స్క్రీనింగ్ లో అందరికీ None of Above అని ఇవ్వవచ్చా?


విద్యార్థుల యొక్క ప్రవర్తన మార్పులు మరియు వారి యొక్క. భౌతిక మరియు మానసిక మార్పులను గమనించి 63 ప్రశ్నలు ఉంటాయి. అందులో ఏదో ప్రశ్న వాళ్ళకి సూటి అవుతుందో ఆ ప్రశ్నకు వారిని సమాధానం కేటాయించాలి. మా పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరూ లేరు అని. అందరూ NONE OF ABOVE సమాధానం ఇవ్వడం సరికాదు. అలాగని మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థిని కేవలం అతని యొక్క డిజిబిలిటీని మాత్రమే సెలెక్ట్ చేసి ఆ ఒక్క విద్యార్థిని మాత్రమే స్క్రీనింగ్ చేసి సబ్మిట్ చేయడం కూడా సరికాదు. పాఠశాలలోని అందరు విద్యార్థుల్ని ఆ క్లాస్ టీచర్లు స్క్రీనింగ్ -1 పూర్తి చేయవలసి ఉంటుంది.


ఆ సమాచారం Special Educator అయిన IERP ల లాగిన్ లో వస్తుంది. అప్పుడు వారు లెవెల్ -2 స్క్రీనింగ్ ను చేయవలసి ఉంటుంది.


Prashast App గమనించవలసిన ముఖ్య విషయాలు:


1) టీచర్ గా login అయిన ఉపాధ్యాయులు అదే phone లో Principal/HM  log in అన్ని టీచర్లను వెరిఫికేషన్ చేయాలంటే ఖచ్చితంగా logout అయి, App ను uninstal చేస్తేనే ప్రధానోపాధ్యాయుల log in లో లాగిన్ కాగలరు.ఒకవేళ ప్రధానోపాధ్యాయులు టీచర్ల హోదాలో స్క్రీనింగ్ చేయాలంటే, మరల log out అయ్యి  app uninstall చేసి install చేయవలెను.


2) Student Name add వేసే సందర్భంలో CAPITAL LETTERS ఇస్తేనే పేరు ADD అవుతుంది.


3) ప్రధానోపాధ్యాయులు వారి LOG IN లో TEACHERS ను VERIFICATION చేస్తేనే టీచర్లు స్క్రీనింగ్ చేయుట సాధ్యపడుతుంది.


Download PRASHAST App Latest Version click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...