TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 24 July 2024

Shiksha Saptah Cultural Day Activities

Shiksha Saptah Cultural Day Activities Day 4 Activities Objectives శిక్షా సప్తాహ్  కార్యక్రమం DAY 4 (25-07-2024):


Shiksha Saptah - 4th day 

,         

విద్యా వారోత్సవాలు.- Cultural day సాంస్కృతిక దినోత్సవం చేపట్టవలసిన కార్యక్రమాలు

  • జాతీయ విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా ఆచరించడం మొదలై ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. దీనిని పురస్కరించుకుని శిక్షా సప్తాహ/విద్యా వారోత్సవాలు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో డైట్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం 
  • విద్యలో ,కళా విద్యని ,సాంస్కృతిక విద్యని అంతర్భాగం చేయాలని జాతీయ విద్యా విధానం 2020 చెబుతోంది
  • 25 జులై 2024 న సాంస్కృతిక దినోత్సవం మనం అట్టహాసంగా జరుపుకోవాలి .
  • భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన లక్ష్యంగా కలిగిన మన భారతీయ సంస్కృతిని విద్యార్థినీ విద్యార్థులు అందరికీ తెలియజేయాలి. 
  • భావిభారత పౌరులుగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా భారతదేశాన్ని *ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్*గా గుర్తించగలగాలి
  • ఈ సందర్భంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతిని వారి భాషని వేషధారణను ఆహార అలవాట్లను వృత్తి విద్యలను సంగీత సాహిత్యాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలి. 
  • ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా పంజాబ్ రాష్ట్ర పరస్పర సంస్కృతిలను తెలుసుకొని ఆచరించాలి.
  • కనుక భిన్నత్వంలో ఏకత్వం లో భాగంగా అన్ని రాష్ట్రాల సంస్కృతిల ప్రదర్శనలో పంజాబ్ రాష్ట్ర సంస్కృతి ప్రదర్శనకి  ప్రాధాన్యత ఇవ్వాలి
  • వివిధ భాషలు మాట్లాడేటట్టుగా పిల్లలని ప్రోత్సహించాలి. వారికి కాస్త సమయం ఇచ్చి ఒక పేరాగ్రాఫ్ ఇతర భాషలలో చదివేలా చేయాలి 
  • ఫ్యాన్సీ డ్రెస్ ,నృత్యాలు , ప్రముఖ దేశభక్తుల నాయకుల మోనో యాక్షన్ ని , వారు ఇచ్చిన నినాదాలని, వివిధ రాష్ట్రాల సంగీత సాహిత్య కళాకారుల ఫోటోల ప్రదర్శన, మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో వాటిని ప్రతిబింబించేలా ప్రదర్శన పాటలు ఆయా రాష్ట్రాల ఆహార పదార్థాలు తయారు చేయడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సృజనాత్మకంగా నిర్వహించవచ్చు 
  • వివిధ రాష్ట్రాలలో ప్రముఖులుగా గుర్తించబడిన వారిని స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అనగానే టంగుటూరి ప్రకాశం పంతులుగారు పంజాబ్ అనగానే శ్రీ భగత్ సింగ్ ఇలాంటివారు మనకు గుర్తొస్తారు 
  • ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి తన రాష్ట్ర గానముంది ప్రతి రాష్ట్రం కి  ఆ రాష్ట్ర పక్షి ఆ రాష్ట్ర జంతువు ఆ రాష్ట్రం వృక్షము ఇవన్నీ కూడా విద్యార్థులకి పరిచయం చేయడానికి ప్రయత్నించండి. 
  • పిల్లలందరికీ అవకాశం ఇవ్వండి సమూహ నృత్యాలు ఒక పద్ధతిగా చేసేటట్టుగా వారికి అవకాశం కల్పించండి 
  • పిల్లలందరూ చక్కగా యూనిఫాంలో ఉండేటట్టుగా చూడండి 
  • సినిమా పాటలు దయచేసి ఎక్కడ ఉపయోగించొద్దు మిలే సుర్ మేరా తుమ్హారా అనే పాటని IFP లో పిల్లలకు వినిపించండి. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పండుగలను ఆచార వ్యవహారాలను వేష భాషను కూడా చూపించవచ్చు
  • రోజు లాగానే ఈ కార్యక్రమానికి కూడా తల్లిదండ్రులను సమాజ సభ్యులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించండి 
  • ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా భారతదేశ సంస్కృతిని అత్యున్నతమైనది అనే భావనని పిల్లల్లో కలిగించాలి 
  • భావిభారత పౌరులుగా భిన్నత్వoలో ఏకత్వాన్ని స్వీకరించి అవగాహన చేసుకుని అందరితో మమేకమైపోయి అన్ని సంస్కృతులను గౌరవించి జీవించగలిగిన సామర్ధ్యాల పచ్చ అవగాహన కలిగించాలి
  • ఏక భారత్ శ్రేష్ఠ భారత్ ని నినాదంగా చేపట్టాలి
  • మన రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠిక ను చదివించి దాని అర్థాన్ని పిల్లలకు వివరించాలి 

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...