WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 31 January 2023

AP Open School 10th, Inter Public Exams April 2023 Fee Payment

AP Open School 10th, Inter Public Exams April 2023 Fee Payment Schedule APOSS SSC, Inter Public Exams April 2023 Fee Payment Schedule APOSS SSC & Intermediate Public Examinations, April 2023 Examination Fee Payment Schedule, Instructions APOSS Public Examinations, April 2023 SSC & Intermediate EXAMS FEE SCHEDULE APOSS SSC & Intermediate Public Examinations, April 2023 Examination Timetable and schedule of exam fee collection


APOSS - SSC & Intermediate Public Examinations, April 2023 - Examination Timetable and schedule of exam fee collection - Communicated - Request to communicate to all the Al- Coordinators and to give wide publicity- Reg. Government approval orders in Note file Ref: 14022(41)/1/2023-EXAM/INTER-APOSS, dt.29.01.2023 Rc.No.APOSS-14022(41)/1/2023-EXAM/INTER-APOSS Dt. 31/01/2023


In the reference cited above, Government pleased to approve the Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April-2023 scheduled from 03.04.2023 to 17.04.2023. The Intermediate Practical Examinations are scheduled from 18.04.2023 to 23.04.2023 and the schedule of examination fee payment is from 01.02.2023 to 07.03.2023.

పరీక్ష ఫీజు ది. 01.02.2023 నుండి 07.03.2023 వరకు అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును. అపరాధ రుసుము లేకుండా ది. 01.02.2023 నుండి 15.02.2023 వరకును; అపరాధ రుసుము రూ.25/- ది. 16.02.2023 నుండి 22.02.2023 వరకును; అపరాధ రుసుము రూ.50/- తో ది. 23.02.2023 నుండి 02.03.2023 వరకును మరియు తత్కాల్ రుసుము, ఇంటర్మీడియట్ నకు రూ. 1000/- మరియు యస్.యస్.సి నకు రు.500/- తో పాటు ఆయా సబ్జెక్టు లకు నిర్దేశించిన పరీక్షా ఫీజును చెల్లించవలెను.

The Timetable of SSC & Intermediate (APOSS) Public Examinations, April-2023 and schedule of examination fee payment are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principals/Headmasters/Al-Coordinators of the study centers of A.P. Open School Society in their respective districts.


Further, they are requested to give wide publicity through print and electronic media, so as to reach the information to the nook and corners of the district.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి

పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్ 2023

పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:


గమనికలు:


1. పరీక్షఫీజు కట్టుటకు అర్హతలు:

(అ) 20 22-23 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది. 31.08.2022 నాటికి యస్.యస్.సి. అభ్యర్థులు 14 సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం || వయస్సు నిండినవారు మాత్రమే పరీక్షఫీజు చెల్లించుటకు అర్హులు.

(ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్ధులు. (ఇ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని అభ్యర్థులు.


2. పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి / చలానా రూపములో స్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.


3. ఎ.పి.టి.ఆన్ లైన్ వారు ఇచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో, మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును.


4. దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి.ఆన్ లైన్ నందు రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి. ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి. తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు. 


5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని సబ్జెక్టులకు ఫీజు చెల్లించి హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు రద్దు చేయబడును. 


6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి పరీక్షలను ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును.' 


7. కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు రద్దు చేయబడును.


8. ఏదేని కారణముచే పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరి తేదిని ప్రభుత్వమువారు సెలవు దినముగా ప్రకటించినచో, ఆ మరుసటి రోజు పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును.


9. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును మరియు చెల్లించిన పరీక్ష రుసుమువాపసు ఇవ్వబడదు.


Download proceedings copy


APOSS 10th, Inter Time Table 2023

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...