WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 30 June 2022

JVK 2022 Kits - Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag

JVK 2022 Kits - Instructions, Check List, Acquittance, Stock Register, Kit Tag JVK 2022 Making, Arrange of student Kits - Instructions, Check List, Acquittance, JVK Stock Register, Kit Tag / ID card


జగనన్న విద్యా కాసుక 2022: విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట, పంపిణీ కొరకు మార్గదర్శకాలు:


'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణీ పై జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో

 ఆర్డినేటర్లు, జిల్లా సీ యం ఓ లకు, మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు: 
  • 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్లు జులై 5, 2022 నుండి జులై 30, 2022 వరకు పంపిణీ చేయాలి.
  • 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణీ పూర్తిగా బయో మెట్రిక్ విధానంలోనే చేయాలి. ఒకవేళ పాఠశాల నందు బయో మెట్రిక్ పరికరాలు పనిచేయని పరిస్తితులలో సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు సంబంధిత పాఠశాలల వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి తెలియచేసి గ్రామ / వార్డ్ సచివాలయాల వద్ద ఉన్న బయో మెట్రిక్ పరికరాల ద్వారా స్టూడెంట్ కిట్ల పంపిణి జరిగేలా చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు రోజు మరియు తరగతుల వారిగా స్టూడెంట్ కిట్ల పంపిణీ గురించి ముందుగానే విద్యార్ధుల యొక్క తల్లి తండ్రులకు తెలియచేయాలి. 
  • 'జగనన్న విద్యాకానుక స్టూడెంట్ కిట్ల పంపిణీ వలన పాఠశాల పనితీరు మరియు బోధన కు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
  • ఒకరోజుకు సుమారుగా 30 నుండి 40 కిట్లు పూర్తి బయో మెట్రిక్ విధానంలో పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా అడ్మిషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. తరువాత సంబంధిత విద్యార్థులకు కిట్లు అందచేయాలి. ఒకవేళ కొత్త విధ్యార్ధుల ప్రవేశాలు అధికంగా ఉండి, అదనముగా స్టూడెంట్ కిట్లు అవసరమైనప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి సరిపడా సైజు అందేవిధంగా చూసుకోవాలి. ఒకవేళ సరిపడా సైజు లేని పక్షంలో సంబంధిత మండల విద్యాశాఖాధికారి కి తెలియచేసి పక్క మండలాల వద్ద ఉంటే, వారి వద్ద నుండి సేకరించి విద్యార్థికి అందేలా చూసుకోవాలి. 
  • 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల నాణ్యత ను విద్యార్ధులకు పంపిణీకి ముందు సరిచూసుకోవాలి. ఒకవేళ పాడైన, చిరిగిన వస్తువులు ఏమైనా గుర్తించినట్లైతే వాటి వివరాలు సంబందిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేస్తూ కొత్తవి తిరిగి తీసుకొనేలా చూసుకోవాలి. 
  • పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్ధుల వివరాలను 15.07.2022 లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారి ద్వారా జిల్లా అధికారులకు తద్వారా రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయచేయాలి. 15.09.2022 లోపు కొత్తగా చేరిన విద్యార్ధులకు కిట్లు అందచేయబడతాయి.
  • మండల కేంద్రాలలో మరియు స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ రెజిస్టర్స్ ను నిర్వహించవలెను. రాష్ట్ర మరియు జిల్లా అధికారులు సందర్శనకు వచ్చినప్పుడు విధిగా స్టాక్ రిజిస్టర్స్ ను చూపించాలి. 
  • మండల కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ల నుండి పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్టు తరలించే సమయంలో రవాణా మరియు ఇతర ఖర్చులను స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్స్ నుండి భరించవలెను.

యూనిఫాం:
  • యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే 'Girls' అని, బాలురకు సంబంధించినవైతే 'Boys అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది. ఎవరిదైతే వారి 'దగ్గర 'టిక్' మార్క్ ముద్రించి ఉంటుంది. 
  • బేల్ లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కొక్క బేల్లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది. GSR INFO - www.gsrmaths.in
  • ఒక్కో బేల్లో ఒకే తరగతికి చెందిన యూనిఫాం క్లాత్ ప్యాకెట్ల రూపంలో వస్తుంది.
  • ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుంది.
  • ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు ప్యాకెట్లో రెండు క్లాత్ పీసులుఉంటాయి. 6-8 తరగతుల బాలికలకు 3 క్లాత్ పీసులు ఉంటాయి.
  • తరగతి వారీగా షర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు కూడా ముద్రించి ఉంటాయి.
  • యూనిఫాం బేల్లో ఒక్కో తరగతికి చెందిన క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది బేల్లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి. (ఉదా: పై కొలతల్లో పేర్కొన్నట్లు ఒకటో తరగతి అబ్బాయి సూటింగ్ క్లాక్ 1.05 మీటర్లు, షర్టింగ్ క్లాత్ 1.47 మీటర్లు ఉండాలి. పై పేర్కొన్న కొలతల ప్రకారం ఉందా లేదా అనేది కొలవాలి. అలానే అన్ని తరగతులకు చెందిన బాలబాలికల క్లాత్ కొలతలు సరిగా ఉన్నాయా లేదా అనేది స్కేలు / టేపుతో కొలిచి పరిశీలించాలి) రవాణా సమయంలో యూనిఫాం ఏవైనా చినిగినవా లేదా పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
  • ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో యూనిఫాం క్లాత్ యొక్క రంగు ఇచ్చిన నమూనాతో సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి.  GSR INFO - www.gsrmaths.in
  • వాటిల్లో క్లాత్ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి. పంపవచ్చు. 
  • రిజక్ట్ చేసిన సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి/ సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి సమాచారం ఇవ్వాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం jvk2apss@gmail.com కు ఈమెయిల్ పంపాలి.
    స్కూల్ బ్యాగులు:
    • రెండు రంగు లలో ఉంటాయి.
    • స్కై బ్లు రంగు అమ్మాయి లకు
    • నావి బ్లు రంగు అబ్బాయిలకు
    • స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి
    • ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి. GSR INFO - www.gsrmaths.in
    • Small: 1, 2 , 3, 4వ తరగతులకు
    • Medium: 5, 6, 7 వ తరగతులకు
    • Large: 8,9, 10 వ తరగతులకు
     బెల్ట్:
    • 3 రకాలు ఉంటాయి
    • 6 నుండి  10 తరగతుల అమ్మాయి లకు  బెల్టులు ఉండవు
    • 6 నుండి  10 తరగతుల అబ్బాయి లకు రెండు వైపుల నవారు కలిగిన బెల్ట్  ఉంటుంది.
    • 1-5 తరగతుల అమ్మాయిలకు ప్లాస్టిక్ బకెల్ తో కూడిన శాటన్ క్లాత్ బెల్టు 80 సెం.మీ.
    • 1-5 తరగతులు బాలురు: 80 సెం.మీ. GSR INFO - www.gsrmaths.in
    • 6-8 తరగతులు బాలురు: 90 సెం.మీ.
    • 9-10 తరగతులు బాలురు: 100 సెం.మీ.

    బూట్లు & సాక్సులకు సంబంధించి:

    • ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి.
    • బాలబాలికలకు సంబంధించి బూట్లు సైజులు, సాక్సులు వివరాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, యన్ టి ఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు. బాపట్ల జిల్లాల వరకు ఈ క్రింది విదంగా ఉంటాయి.

    • బాలబాలికలకు సంబందించి బూట్లు సైజులు, సాక్సులు వివరాలు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీ సత్య సాయి, వై యస్ ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూర్ జిల్లాల వరకు ఈ క్రింది విధంగా ఉంటాయి.

    నోట్ బుక్స్:
    • 1-5 తరగతులకు లేవు.  GSR INFO - www.gsrmaths.in
    • 6-7 తరగతులకు: 200 పేజీల వైట్ లాంగ్ 3, 200 పేజీల రూల్ద్ లాంగ్ 4, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1,  మొత్తం  8
    • 8వ  తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 4, 200 పేజీల రూల్ద్ లాంగ్ 4, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  10 GSR INFO - www.gsrmaths.in
    • 9 వ తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 5, 200 పేజీల రూల్ద్ లాంగ్ 5, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  12
    • 10 వ  తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 6, 200 పేజీల రూల్ద్ లాంగ్ 6, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  14
    నిఘంటువు: ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు

    • ఒకటో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీ, 6వ తరగతి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కిట్ లో భాగంగా ఇవ్వవలసి ఉంటుంది.

    కిట్లు రూపకల్పన చేయు విధానం:
    • బ్యాగులు అందిన తర్వాత 'స్టూడెంట్ కిట్' సిద్ధం చేసి ప్రభుత్వం ఖరారు చేసిన తేదీ నాటికి ప్రతి విద్యార్థికి అందించేలా సన్నద్ధులై ఉండాలి.
    • ఏ తరగతి విద్యార్థికి ఏయే వస్తువులు బ్యాగులో వేసి సిద్ధం చేయాలో 'అనుబంధం-11లో పొందుపరచడమైనది.
    • ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.

    ఉదాహరణకు ఆరో తరగతి అబ్బాయిలకు చెందిన స్టూడెంట్ కిట్ ఎలా సిద్ధం చేయాలో చూద్దాం.

    1) మీడియం సైజు బ్యాగు తీసుకోవాలి.

    2) ఆరో తరగతికి అబ్బాయిలకు కేటాయించిన 3 జతల యూనిఫాం క్లాత్ ప్యాకెట్ బ్యాగులో వేయాలి.

    3) 200 పేజీల వైట్ లాంగ్ (3), 200 పేజీల రూల్డ్ లాంగ్ (4), 200 పేజీల బ్రాడ్ రూల్డ్ (1) ఇలా మొత్తం 8 నోటు పుస్తకాలు బ్యాగులో వేయాలి.

    4) తర్వాత 6 వ తరగతి పాఠ్యపుస్తకాలు బ్యాగులో చేయాలి. 

    5) బాలురకు సంబంధించి రెండు వైపులా నవారు కలిగిన బెల్టు (90cm) బ్యాగులో వేయాలి. 

    6) 6 నుంచి 10వ తరగతికి కేటాయించిన ఒక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని బ్యాగులో వేయాలి.

    7) ఆ విద్యార్థికి సంబంధించిన సరిపోయే బూట్లు మరియు తగిన రెండు జతల సాక్సులు బ్యాగులో వేసుకోవాలి. 

    * ఇలా తరగతి వారిగా బాలురకు విడిగా, బాలికలకు విడిగా కిట్లు సిద్ధం చేసుకుని ఉండాలి.

    * దీనితో స్టూడెంట్ కిట్ అన్ని వస్తువులతో సంపూర్ణంగా సిద్ధం చేసినట్లు పరిగణించాలి.

    * సిద్ధం చేసేటప్పుడు బ్యాగు చినిగిపోకుండా, మిగతా వస్తువులు పాడవకుండా చాలా జాగ్రత్త వహించాలి. 

    * ఇదే విధంగా ప్రతి పాఠశాలలోను బాలబాలికలకు సంబంధించిన కిట్లు సిద్ధం చేసుకోవాలి.

    * ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి. 

    * అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది.

    * కిట్కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి?) ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి. 

    వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకాల తో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటి నీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.


    Do you have any doubts? Join Our WhatsApp Group
    Hello, How can I help you? ...
    Click me to Join Group and chat...