WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 7 August 2021

JVK Kit Distribution Minutes of meeting

తేదీ. 06-08-2021 ఎస్. పి. డి, ఏ.పి .యస్ .యస్ & పాఠాశాల విద్యా కమిషనర్ వారి WEBEX మీటింగ్ మినిట్స్

తేది. 06-08-2021 ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పదక సంచాలకులు మరియు పాఠశాల విద్యాకమిషనర్ వారి అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు, అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ లు , మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటి మొబలైజేషన్ అధికారులు మరియు అకడమిక్ మానిటరింగ్ అధికారులతో జగనన్న విద్యా కానుక మీధ WEBEX మీటింగ్ నిర్వహించడము జరిగినది.

ముఖ్యాంశాలు : -

ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వారి సూచనలు:

  • JVK APP ను డౌన్ లోడ్ చేసుకొని మండల కేంద్రాలకు వచ్చిన మెటీరియల్ వివరములను మండల విద్యాశాఖాధికారులు 
  • స్కూల్ కాంప్లెక్స్ లకు చెంఉన్న మెటరియల్ వివరములను స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు JVK APP నందు వెంటనే అప్లోడ్ చేయవలెను.
  • ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా రాష్ట్ర పదక సంచాలకులు వారు మండల కేంద్రములకు వచ్చిఉన్న JVK మెటీరీయల్ (UNIFORMS, BAGS) స్కూల్ కాంప్లెక్స్ లకు పంపించవలెను స్కూల్ కాంప్లెక్స్ లకు చెరిఉన్న మెటీరియల్ ను పాఠశాల లకు పంపించవలెను. GSR INFO www.gsrmaths.in
  • పాఠశాలలో ఉపాధ్యాయులు అందరి భాగస్వామ్యములో తరగతి వారిగా, విద్యార్థి వారిగా JVK KITS ను సిద్ధము చేయవలెను.
  • మండల కేంద్రమునకు / స్కూల్ కాంప్లెక్స్ లకు చేరిన JVK Material చలానాపై మండల విద్యాశాఖాధికారి / SCHM సంతకము తో పాటుగా తేది ని కంపల్సరీగా నమోదు చేయవలెను.
  • మండల విద్యావనరుల కేంద్రము, స్కూల్ కాంప్లెక్స్ లలో తప్పనిసరిగా స్టాక్ నమోదు రిజిస్టర్ మరియు Stock Issue రిజిస్టర్ తప్పనిసరిగా మెయిన్ టైన్ చేయవలెను.
  • JVK వస్తువుల పంపిణీ కి సంబందించి వీడియో రూపొందించడము జరిగినది. దానిని అందరికి పంపడము జరుగును. దానిలో సూచించిన విధముగా ఎలాంటి పొరపట్లకు తావులేకుండా కచ్చితత్వముతో మెటీరియల్ పంపిణీ జరగవలెను.
  • JVK వస్తువులలో ఏమైనా డామేజ్ ఉన్నట్లైతే రిటన్ చేయవచ్చు.
  • ఆగష్టు 10 వ తేది లోపు JVK వస్తువులకు సంబంధించి పూర్తి సమాచారము (Received, Distributed, Balance, Requirement) రాష్ట్ర సమగ్ర శిక్షా కార్యాలయమునకు పంపవలెను

రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వారి సూచనలు:
  • మండల కేంద్రము నుండి స్కూల్ కాంప్లెక్స్ లకు JVK Material పంపిణీ కి సంబందించి రూపొందించిన మోడల్ వీడియోను అన్ని WATS APP గ్రూపులలో విస్తృత ప్రచారం నిర్వహించి. వీడియో లో సూచించిన విదముగా మేటరీయల్ పంపిణీ చేయవలెను.
  • JVK వస్తువుల పంపిణీకి సంబంధించి బయో మెట్రిక్ authentication కొరకు ఆగష్టు 13న నియోజక వర్గము / మండలం లలో ఒకొక్క పాఠశాలలో ట్రైల్ రన్ చేయాలి. 
  • JVK వస్తువుల పంపిణీలో పాఠశాలలోని అందరూ ఉపాద్యాయులు భాగస్వామ్యము కావాలి. ఎవ్వరికిని మినహాయింపు లేదు.
  • గౌరవ ముఖ్యమంత్రి వర్యులవారు జగనన్న విద్యా కానుక లాంఛనముగా ఆగష్టు 16న ప్రారంబించబడును.
  • ఆగష్టు 16 నుండి ఆగష్టు 31 వరకు జగనన్న విద్యా కానుక పక్షోత్సవాలు నిర్వహించబడును. GSR INFO www.gsrmaths.in
  • ఈ రోజులలో పాఠశాలలో విద్యార్థులకు JVK kit లను పంపిణీ నిర్వహించవలెను. 
  • పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు. 25 మంది పిల్లలకు బాధ్యతను వహించవలయును వారందరికి JVK kit లు సక్రమముగా అందేలా బాధ్యతను వహించవలయును.
  • జిల్లా లోని అందరూ మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ గారు మరియు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వారి సూచనలు పాటించి JVK కిట్స్ సక్రమంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పంపిణీ చేయవలసినదిగా సూచించడమైనది.

Download JVK Minutes of meeting
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...