TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 5 August 2021

JVK 2021 Material Distribution, Stock Register, Uploading - Guidelines

Jagananna Vidyakanuka JVK 2021 distribution of material from Mandal points to School complex points.

ఆర్.సి.నెం. SS-16021/3/2021-CMO SEC SSA 05/08/201

విషయం: సమగ్రశిక్షా - 'జగనన్న విద్యా కానుక' 2021-22 - మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్ బూట్లు& సాక్సులు మరియు బ్యాగులు సరఫరా సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు

నిర్దేశాలు: 1) ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC-SSA తేది: 07-06.2021

ఆదేశములు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం మండల రిసోర్సు కేంద్రాలకు చేరిన యూనిఫాం, బూట్లు & సాక్సులు, బ్యాగులు వంటి వాటిని చేరిన ఒకటి రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు సరఫరా చేయవలసి ఉంటుంది.మండల విద్యాశాఖాధికారులు తమ మండల రిసోర్సు కేంద్రానికి యూనిఫాం/ బూట్లు & సాక్సులు మరియు బ్యాగులు చేరిన ఒకట్రెండు రోజుల్లో స్కూల్ కాంప్లెక్సులకు చేర్చేలా ప్రణాళిక వేసుకోవాలి. నిర్ణీత తేదీలు కేటాయిస్తూ తమ పరిధిలోని స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించాలి. 

మండల విద్యాశాఖాధికారులు జగనన్న విద్యాకానుక' యాప్ లో పొందుపరిచిన సమాచారం మేరకు ఆయా స్కూల్ కాంప్లెక్సులకు చెందిన తరగతి వారీగా బాలబాలికలకు ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వవలసి ఉంటుందో సరిచూసుకొని సరఫరా చేయాలి..

ఎంఆర్సీ/ స్కూల్ కాంప్లెక్సులలో వస్తువులు పంపిణీ కోసం టేబుళ్లు, కుర్చీలు, డిస్ ప్లే బోర్డు, మార్కర్లు, స్టాప్లర్, శానిటైజర్, దుస్తులు కొలిచే టేపు/ స్కేలు వంటివి అవసరానికి అనుగుణంగా ఉపయోగించాలి. 

ఎంఆర్సీల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు యూనిఫాం క్లాత్, బూట్లు & సాక్సులు మరియు బ్యాగుల సరఫరా

ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమష్టి బాధ్యతగా భావించాలి.

అ) యూనిఫాం క్లాత్ సంబంధించి

  • యూనిఫాం బేల్స్ రూపంలో ఉంటాయి. ఒక్కో బేల్ లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో వాటిపై ముద్రించి ఉంటుంది. బాలికల 'G' అని బాలురవైతే 'B'అని, దీంతోపాటు తరగతికి ఎదురుగా' టిక్' మార్క్ ఉంటాయి.
  • ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు కేటాయించిన ప్యాకెట్లలో రెండు రకాల క్లాత్ పీసులు ఉంటాయి. 6-10 తరగతుల బాలికల ప్యాకెట్లలో 3 రకాల క్లాత్ పీసులు ఉంటాయి.
  • తరగతి వారీగా పర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు ప్యాకెట్ మీద ముద్రించి ఉంటాయి.

* నక్షత్రం గుర్తు ఉన్నవి నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది.

  • ఒక్కో తరగతికి చెందిన ఒక్కో బేల్ నుండి ఒక ప్యాకెట్ తీసుకొని పైన ఇచ్చిన పట్టిక ప్రకారం యూనిఫాం. కొలతలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.
  • మండల రిసోర్సు కేంద్రంలో సరఫరా కోసం కేటాయించిన ఒక గదిలో తరగతి వారీగా బాలుర యూనిఫాం, బాలికల యూనిఫాం విడివిడిగా పెట్టుకోవాలి.
  •  ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని యూనిఫాం ప్యాకెట్లు కావాలో తీసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు, బాలికల యూనిఫాం వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.

ఆ) బూట్లు &సాక్సులకు సంబంధించి

  • ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా, సైజులు వారీగా బాలురు, బాలికలకుఎన్నెన్ని బూట్లు మరియు సాక్సులు కావాలో తీసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకోవాలి. బాలురు, బాలికల బూట్లు మరియు సాక్సులు వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి..
  • బాలబాలికలకు సంబంధించి బూట్లు సైజులకు అనుగుణంగా, సుమారుగా తీసుకెళ్లవలసిన సాక్సులు

వివరాలు:

  • బూట్లు, సాక్సులు ఏవైనా చిరిగినవా, కుట్లు సరిగా ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి. . 

ఇ) బ్యాగులకు సంబంధించి:

ప్రతి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తరగతుల వారీగా, సైజులు వారీగా బాలురు, బాలికలకు ఎన్నెన్ని బ్యాగులు కావాలో తీసుకొని వేర్వేరు గోనె సంచుల్లో వేసుకోవాలి.

బాలికలకు స్కై బ్లూ రంగు, బాలురకు నేవీ బ్లూ రంగు బ్యాగులు తరగతుల వారీగా కింది ఇచ్చిన పట్టిక ప్రకారం తగిన సైజులు అందజేయాలి.

  • స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బ్యాగు నందు డబుల్ జిప్పులు, షోల్డర్, డబుల్ రివిట్స్, షోల్డర్ ఫ్లాప్ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్ క్లాత్ మరియు కుట్లు సరిగా ఉన్నాయో లేవో నాణ్యతను సరి చూసుకోవాలి. 2 లేదా 3 బేల్ లోని బ్యాగులు తనిఖీ చేయాలి.
  • మీరు తీసుకోవలసిన వస్తువుల్లో ఏవైనా డ్యామేజ్ అయినా, సరిపడా సైజు లేకపోయినా, చినిగిపోయినా సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆ వివరాలను ఎంఆర్సీ కేంద్రం/ స్కూల్ కాంప్లెక్స్ లో ఉంచిన స్టాకు రిజిస్టరులో నమోదు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారికి లేదా సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి తెలియజేయాలి.
  •  'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి అన్ని వస్తువులు మండల రిసోర్సు కేంద్రాల నుంచి స్కూల్ కాంప్లెక్సులకు చేరిన తర్వాత భద్రపరిచే గదిలో వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి. 
  • మండల రిసోర్సు కేంద్రాల నుండి స్కూల్ కాంప్లెక్సులకు వస్తువులను తరలించడానికి అయ్యే ఖర్చును సంబంధిత స్కూల్ కాంప్లెక్సు నిధుల నుండి సమకూర్చుకోవాలి. 

కోవిడ్ - 19 నిబంధనలతో పాటు శానిటైజర్, మాస్క్, భౌతికదూరం తప్పనిసరి.

'జగనన్న విద్యాకానుక' వస్తువుల పంపిణీలో ఏవైనా సందేహాలు ఉన్న యెడల 9154294169 నంబరులో కార్యాలయపు పనివేళ్లలో సంప్రదించగలరు.

స్టాకు రిజిస్టర్ నిర్వహణ:

  • ప్రతి జిల్లా కార్యాలయం / మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సు/ ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి ఇది వరకు సూచించిన విధంగా ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి.
  • మండల రిసోర్సు కేంద్రం నుంచి స్కూల్ కాంప్లెక్సులకు, అలాగే స్కూల్ కాంప్లెక్సుల నుండి పాఠశాలలకు వస్తువులను సరఫరా చేసిన తర్వాత స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
  • రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సు/ పాఠశాలకు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.

లాగిన్లలో నమోదు:

మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు 'జగనన్న విద్యాకానుక' యాప్ లో తమకిచ్చిన లాగిన్ నందు అందుకున్న వస్తువుల వివరాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నమోదు చేయాలి. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు సంబంధిత జిల్లాలకు పంపడం జరిగింది.

రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా  ఆదేశించిండమైనది.

Download JVK 2021 Proceedings

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...