WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 27 November 2020

AP Teachers Transfers 2020 Clarifications 26.11.20

 అక్టోబర్ లో జరిగిన ప్రమోషన్లకు రీ కౌన్సెలింగ్

తెలుగు, హిందీ పండిట్ల ఉద్యోగోన్నతులకు రీకౌన్సెలింగ్ చేయండి

ప్రకాశం జిల్లా డి.ఈ.ఓ కి కమీషనర్ ఆదేశం. జిల్లాలో తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంటు పోస్టులకు నిర్వహించిన ఉద్యోగోన్నతల కౌన్సెలింగ్ ను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

స్కూలు అసిస్టెంటు తెలుగు, హిందీ పోస్టులు భర్తీకి అక్టోబరు 21న డీఈవో ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ ను నిర్వహించారు. కేవలం గ్రేడ్-2 భాషోపాధ్యాయులను మాత్రమే పరిగణలోకి తీసుకో కుండా సెకండరీగ్రేడ్ టీచర్లకు అన్యాయం చేశారని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సింగిల్ సబ్జెక్టు, థర్డ్ మెథడాలజీ ఉన్నవారికి కూడా ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నా పరిగణలోకి తీసుకోలేదనే విషయాన్ని డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన డైరెక్టర్ ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలను సవరించి పారదర్శకంగా తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. పాఠశాల విద్య ఆర్టేడీ పర్య వేక్షణలో తాజాగా ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

Download Clarification Orders

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...