TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 15 April 2020

Emerging pattern of new tested positive covid 19 Instructions by AP DGP

కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న కరెన్సీ నోట్లు.. గుర్తించిన ఏపీ అధికారులు...

గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు కేసుల నమోదు...

అప్రమత్తమైన యంత్రాంగం...

డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన...

   జనాల్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతోందా? అంటే, అవుననే అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు వచ్చారు.

  కరోనా వైరస్‌ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్‌ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్‌ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్‌, స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్‌ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.
Download DGP Memorandum
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...