TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 2 April 2020

Aarogya Setu Android App of India to fight COVID-19 updated

Aarogya Setu Android Application

♦భారత అఫీషియల్ కరోనా యాప్.. మీ సమీపంలో ఎవరికైనా కోవిడ్  సోకితే ఇట్టే తెలుసుకోవచ్చు
   
  GoI’s app to connect health services with the people of India to fight COVID-19


   Aarogya Setu is a mobile application developed by the Government of India to connect essential health services with the people of India in our combined fight against COVID-19. The App is aimed at augmenting the initiatives of the Government of India, particularly the Department of Health, in proactively reaching out to and informing the users of the app regarding risks, best practices and relevant advisories pertaining to the containment of COVID-19.

🔸Aarogya Setu App: భారత ప్రభుత్వం అధికారిక కరోనా ట్రాకింగ్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా మీ సమీపంలో ఎవరైనా కరోనా బారిన పడితే వెంటనే తెలుసుకోవచ్చు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి అప్‌డేట్స్ పొందొచ్చు.

🔸భారత ప్రభుత్వం అధికారిక కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టింది. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యాప్‌ను రూపొందించింది. ఎన్ఐసీ సూచనలను ఫాలో అవుతూ.. నాలుగు రోజుల్లోనూ ఈ యాప్‌ను రూపొందించడం గమనార్హం. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ లొకేషన్ డేటా, బ్లూటూత్ ద్వారా... కోవిడ్ సోకిన వ్యక్తి సమీపంలో యూజర్ ఉన్నాడా లేదా అని ఈ యాప్ చెబుతుంది.

🔹ఆరోగ్య సేతు యాప్‌లో రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ హెల్ప్ లైన్ల సమాచారాన్ని వివరంగా పొందుపరిచారు. ఇందులోని చాట్‌బోట్ ద్వారా యాప్ వాడుతున్న వారు కరోనా లక్షణాలను అర్థం చేసుకొని, ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. కరోనా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ అందించే అప్‌డేట్స్‌ను కూడా ఈ యాప్‌లో పొందొచ్చు. అండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే లైవ్ ట్వీట్లను కూడా వీక్షించే వీలుంది.

🔸ఈ యాప్ వాడాలనుకునే వారు తమ ఫోన్ నంబర్ సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ అండ్రాయిడ్‌తోపాటు ఐఓఎస్‌లోనూ అందుబాటులో ఉంది. 11 భాషల్లో కరోనా గురించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వార పొందొచ్చు.

Download Arogya Sethu android app
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...