WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 16 November 2019

Amma vodi complete process in telugu Rc.No. 242 dt.16.11.19

అమ్మ ఒడి కి సంబంధించి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో సూచించిన ముఖ్య అంశాలు:

1. అన్ని  యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థుల వివరాలను కచ్చితంగా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయాలి.
2.ఇంకనూ నమోదు చేయని విద్యార్థుల వివరాలను 18.11.2019 కల్లా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేసుకోవచ్చు.
3.19.11.2019 తేదీన ఉన్న విద్యార్థులను మాత్రమే  "అమ్మ ఒడి "కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న ప్రత్యేక వెబ్ సైట్ లోకి డేటాను పంపించబడుతుంది.
4. ఈ విద్యార్థుల ఆధార్ నెంబర్ ఆధారంగా రేషన్ కార్డ్ లేదా పల్స్ సర్వే లోని డేటాతో సరిపోల్చి విద్యార్థుల తల్లుల మరియు బ్యాంక్ అకౌంట్ల వివరాలను సంగ్రహిస్తారు.
5. అమ్మఒడి ప్రత్యేక వెబ్ సైట్ నుండి అందరు ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ లో వివరాలను చెక్ చేసుకుని పేరెంట్స్ కమిటీ తో సంప్రదించి,ఆ వివరాలను గ్రామ సచివాలయం లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందిస్తారు.
6. ఈ గ్రామ సచివాలయం లో అసంపూర్తిగా ఉన్న విద్యార్థుల వివరాలను వలంటీర్ల సహకారంతో డేటాను కలెక్ట్ చేసి  గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు
7. ఆ తరువాత వచ్చిన లిస్టులను గ్రామ సచివాలయం లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందిస్తారు.
8. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచివాలయం ద్వారా వచ్చిన అమ్మ ఒడి విద్యార్థుల లిస్టును మరొక్కసారి చెక్ చేసుకుని సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా మండల విద్యాశాఖ అధికారి వారికి ఆమోదం కోసం పంపించాలి. ఇందులో గమనించవలసిన ముఖ్య అంశం ఏమిటంటే ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ ఈ పథకానికి పూర్తి బాధ్యత వహిస్తారు.
9. మండల విద్యాశాఖ అధికారి తదుపరి ఆమోదం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించిన తరువాత మాత్రమే అమ్మ ఒడి నిధులు విడుదల అవుతాయి.

Download Latest Guidelines amma vodi
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...