WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 3 November 2016

Income Tax Calculation /Income Tax Act 207-18 A.Y 2018-19 Sections wise Information

Income Tax 2017-18 (Assessment Year 2018-19) Income Tax Slab for Individual Tax payers
ఆదాయపు పన్ను శ్లాబులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను గణన - పూర్తి వివరాలు తెలుగులో and in English

  • Rebate upto Rs 2500/-to resident individuals whose total income (TI) < Rs 3.50 lacs
  • Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 3.5 లక్షల లోపు ఉన్నవారికి  చెల్లించాల్సిన టాక్స్ లో రూ. 2.5,00/- రిబేట్ కలదు.
  • Cess @3% For All Assesses Continues
  • చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.
Income under the head Salaries
1.1 Salary is defined to include:
a) Wages
b) Annuity
c) Pension
d) Gratuity
e) Fees, Commission, Perquisites, Profits in lieu of or in addition to Salary or Wages
f) Advance of Salary
g) Leave Encashment
h) Annual accretion to the balance of Recognized Provident Fund
i) Transferred balance in Recognized Provident Fund
j) Contribution by Central Government or any other employer to Employees Pension Account as referred in Sec. 80CCD

ఆదాయముగా పరిగణించబడే జీత త్యములు
🔹Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

 ఆదాయముగా పరిగణించబడని అంశములు
🔹పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు:
Least of the following is exempt:
a) Actual HRA Received
b) 40% of Salary 
c) Rent paid minus 10% of salary
* Salary= Basic + DA (if part of retirement benefit) + Turnover based Commission
Note:
i. Fully Taxable, if HRA is received by an employee who is living in his own house or if he does not pay any rent
ii. It is mandatory for employee to report PAN of the landlord to the employer if rent paid is more than Rs. 1,00,000 [Circular No. 08 /2013 dated 10th October, 2013].

🔹Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం
🔹ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ
40% వేతనం
🔹ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.

మినహాయింపులు:
🔹ఇంటి ఋణం పై వడ్డి (Section 24):
ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ  ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.

u/s 24 and 80 EE 
 There is an Exemption for interest on housing loan.(for Self occupied Residence). If the loan was taken before Apr 1, 1999 exemption is limited to ₹30,000/- per year. If the loan was taken after Apr 1, 1999 exemption is limited to ₹2,00,000/- per year if the house is self-occupied; There is no limit if the house is rented out
       This exemption is available on accrual basis, which means if interest has accrued, you can claim exemption, irrespective of whether you've paid it or not.. 80EE In finance bill 2016 (an additional rebate of ₹.50.000/- was given to those assessee, who purchase self occupied single house after 01/04/2016 with maximum value of ₹ 60 Lacs and sanctioned home loan up to 35 Lacs.) 

ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E)
🔹 Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2016-17  ఆర్ధిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.
Interest on education. Loan Interest paid for a period of 8 years

ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U)
Self suffering from disability: 
 Individual suffering from a physical disability (including blindness) or mental retardation - Rs. 75,000

  Individual suffering from severe disability - Rs. 1,25,000

🔹ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.

మెడికల్ ఇన్సురెన్స్ (80D):

Medical Insurance – Self, spouse, children Medical Insurance –  Rs. 25,000 
Parents more than 60 years old or (from FY 2015-16) uninsured parents more than 80 years old - Rs. 30,000

 🔹ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని (గరిష్టంగా 25,000/- లు), ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని (గరిష్టంగా 25,000/- )పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు.

ఉద్యోగి  సిటిజెన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.

ఆధారపడిన వారు వికలాంగులయితే (80DD):   
 
Medical treatment for handicapped dependant or payment to specified scheme for maintenance of handicapped dependant 
 Disability is 40% or more but less than 80% - Rs. 75,000 
 Disability is 80% or more - Rs. 1,25,000   
                                                              
🔹ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆధారపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.

అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB)

Medical Expenditure on Self or Dependent Relative for diseases specified in Rule 11DD
 For less than 60 years old   - Lower of Rs 40,000 or the amount actually paid   
 For more than 60 years old - Lower of Rs 60,000 or the amount actually paid
 For more than 80 years old - Lower of Rs 80,000 or the amount actually paid

 🔹ఉద్యోగి కాని తనమీద ఆధారపడిన వారు Cancer, Hemophilia, Thalassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

చందాలు (80G)
 🔹PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

 Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2016 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు.

🔸కన్వేయన్స్ అలవెన్స్ కి  మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు.

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:

 Investment in PPF   Employee’s share of PF contribution  NSCs  Life Insurance Premium payment  Children’s Tuition Fee  Principal Repayment of home loan  Investment in Sukanya Samriddhi Account  ULIPS  ELSS  Sum paid to purchase deferred annuity  Five year deposit scheme  Senior Citizens savings scheme  Subscription to notified securities/notified deposits scheme  Contribution to notified Pension Fund set up by Mutual Fund or UTI.  Subscription to Home Loan Account Scheme of the National Housing Bank  Subscription to deposit scheme of a public sector or company engaged in providing housing finance  Contribution to notified annuity Plan of LIC  Subscription to equity shares/ debentures of an approved eligible issue  Subscription to notified bonds of NABARD

🔹వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund Sukanya Samriddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు.

Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC):

🔹LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం.

For amount deposited in annuity plan of LIC or any other insurer for pension from a fund referred to in Section 10(23AAB).

 CPS deduction(80CCD):

80CCD(1) - Employee’s contribution to NPS account (maximum up to Rs 1,50,000) 
80CCD(2) - Employer’s contribution to NPS account Maximum up to 10% of salary 
80CCD(1B) - Additional contribution to NPS Rs. 50,000 

 🔹కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం 1లక్ష వరకు మినహాయింపు కలదు . ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని రూ. 1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు. 80CCD(1B) తో 50,000/- అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వస్తుంది.

 FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ముపైన 50,000 వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు  సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా  ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80సి కింద CPS నిది కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 

2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS)  నిది కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు

* 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.

అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG):

 🔹Rajiv Gandhi Equity Saving Scheme ద్వారా 1.5 లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు.

సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA):

 🔹సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.

80TTA(1) - Interest Income from Savings account Maximum up to 10,000

 Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2019 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి

🔹జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDO లకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా  "PAN"  కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5 లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2017 లోపు Income Tax Department వారికి సమర్పించాలి.

 ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు

🔹ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో  పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2018 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యూల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి
.

Download IT Softwares / Income Tax Calculation Softwares for 2017-18
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...