TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 10 February 2024

MJPAP BCWREI 5th Notification 2024-25 Apply Online

MJPAP BCWREI 5th Notification 2024-25 Apply Online AP BC Welfare Class 5 Admissions 2024 Notification Online Application Form MJPAPBCWCET-2024 MJPAPBC - 5th Class Admission-Notification 2024-25 MJPAP BCWREI Class 5 Admissions 2024-25-Notification-Online Application APBCWRS CET 2024 Notification for AP BC Welfare 5th Class Application Form For 5th Class Admissions in MJPAPBC Welfare Residential Educational Institutions 2024-25 AP BC Welfare 5th Class Admission 2024 in BC Residential Schools MJPAP BCWREI Class 5 Admissions 2024-2025-Notification-Schedule-Fee Payment-Online Application MJP AP BC CET 2024 notification, Class 5 apply date 5th Class Admission Application Form Mjpapbcwreis 5th notification 2024 25 date mjpapbcwreis schools list ap bc welfare residential schools list mjptbcwreis apply online 2024 last date mjpapbcwreis full form


AP BC Welfare Class 5 Admissions 2024 Notification Apply Online...Applications are invited for admission into Class 5 (English Medium) State Syllabus for the academic year 2024-25 in BC welfare Schools  run by Mahatma Jyotibapoole Backward Classes Welfare Gurukula Vidyalayas, from candidates of B.C.BC, SC, ST, and EBC.


మహాత్మా జ్యోతిబాఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశ ప్రకటన


మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి.సి. బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ బిసి, ఎస్సీ, ఎస్టీ, మరియు ఇ. బి.సి అభ్యర్ధుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులననుసరించి, ఆయా MJP పాఠశాలల్లో పరీక్ష నిర్వహించబడును.


ప్రవేశానికి అర్హత:

  • వయస్సు: ఓ.సి., బి.సి మరియు ఈ.బిసి. (O.C/B.C/E.BC) లకు చెందిన వారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి మరియు యస్.టి (S.C/ST) విద్యార్ధులు 9 నుండి 13 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. 
  • ఆదాయ పరిమితి: అభ్యర్ధి యొక్క తల్లి, తండ్రి, సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.1,00,000 లకు మించి ఉండరాదు. 
  • జిల్లాలోని గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
  • విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా (2022-23, 2023-24) చదువుతూ ఉండాలి. విద్యార్ధులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 4వ తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.

ప్రవేశ పరీక్ష: 

  • ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు (తెలుగు - 10. ఇంగ్లీష్-10, లెక్కలు.. 15. పరసరాల విజ్ఞానం 15 మార్కులలో ఆబ్జెక్టివ్ టైపులో - ఉంటుంది.
  • జవాబులను ఓ.యం.ఆర్ . పీట్ లో గుర్తించాలి.
  • పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.

పరీక్షా కేంద్రం: విద్యార్థిని విద్యార్ధులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్ లో ఇవ్వబడును. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్ధుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.


పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాధ / మత్స్యకార) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.


రిజర్వేషన్ - పట్టిక:

MJPAP BCWREI 5th Notification 2024-25 Apply Online

  • ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేని యెడల అట్టి ఎదని రిజర్వేషన్ ఖాళీలను బి.సి. కేటగిరీ అభ్యర్థులకు కేటాయిస్తారు.
  • SC మరియు ST రిజర్వేషన్ కేటగిరీలోను అభ్యర్ధులు లేని యెడల మార్చుకోనవచ్చును.
  • ఎంపిక సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేది ప్రకారం అధిక వయస్సు గల విద్యార్ధికి ప్రాధాన్యత ఇవ్వబడును. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే.. లెక్కలలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు పొందితే, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
  • జిల్లాల వారీగా పాఠశాల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక-2 లో . ఇవ్వబడినవి.
  • ఎంపికైన విద్యార్ధులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
  • ప్రవేశానికి ఎంపికైన విద్యార్థుల హాల్ టిక్కెట్ నెంబర్లు https://mjpapbcwreis.apcfss.in వెబ్ సైట్ లో ఉంచబడతాయి.
  • ప్రవేశానికి ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు (కాల్ లెటర్స్) పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.

దరఖాస్తు చేయు విధానం: 

  • అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేది. 01.03.2024 నుండి తేది. 31.03.2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఏదేని (Payment) ఏపీ ఆన్లైన్ కి ప్రాథమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి/సంరక్షకుని మొబైల్ నెం ) వెళ్ళి రూ.100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. జర్నల్ నెంబర్ పొందినంత మాత్రాన ధరఖాస్తు చేసుకున్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబర్ మాత్రమే.
  • ఆ జర్నల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్ నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్ సైట్ https://mjpapbcwrels.apcss.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం (కాలమ్) లో నమోదు చేయవలెను.
  • ఆన్లైన్ దరఖాస్తును నింపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడును. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
  • దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి వద్ద కుల ధృవీకరణ, (సమీకృత కుల, జనన ఆదాయం ధృవ విత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ దృవీకరణ, స్టడీ మరియు బోన ఫైడ్ సర్టిఫికేట్ మొదలగు ధృవపత్రాలు (ఒరిజినల్) పొంది ఉండాలి. ధృవపత్రాలు ఒరిజినల్ కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు.
  • ఆన్లైన్ లో కాక నేరుగా సంస్థకు కానీ, గురుకుల పాఠశాలకు గాని మరియు ఇ-మెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించరు. అట్టి అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు. 
  • హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టిక్కెట్లు దగ్గరలోని ఎదైన ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటరు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చును. 
  • హాల్ టిక్కెట్లు పోస్టులో గాని, నేరుగా కానీ అభ్యర్థులకు పంపబడవు. కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.
  • అర్హత లేని అభ్యర్ధుల దరఖాస్తులు పరిశీలించబడవు. 

దరఖాస్తు నింపుటకు అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు:
  • దరఖాస్తును ఆన్లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
  • పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి.
  • పాఠశాల ప్రాధాన్యతాక్రమము ఎందుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి. 
  • పాస్ పోర్ట్ సైజు ఫోటో ను సిద్ధంగా ఉంచుకోవాలి..
  • దరఖాస్తులను నింపునప్పుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. 
  • సెల్ నెంబర్ వ్రాయునప్పుడు విద్యార్థి కుటుంబమునకు సంబంధించిన నంబరు లేదా సమీప బందువుల నెంబరు ఇవ్వవలయును. 
  • దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించాలి. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు.
  • ఒకసారి దరఖాస్తును ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్ని వివరాలు ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.
  • ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును.
  • ఆయా జిల్లాల విద్యార్ధిని విద్యార్ధులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు. ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు పరిస్థితులలో బదిలీ చేయబడదు.

Online Application click here


Download MJPAP BCWREI 5th Notification

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...