TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 29 December 2022

Bank Holidays in 2023

Bank Holidays in 2023 in AP and TS Andhrapradesh Telangana Bank Holidays for the year 2023 


కొత్త ఏడాది 2023లో బ్యాంకు సెలవులు..
సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు మెబైల్‌లోనే దాదాపు అన్ని ఆర్థిక కార్యకలాపాలూ జరిగిపోతున్నాయి. ఖాతా తెరవడం దగ్గర నుంచి ఇతరులకు నగదు పంపించడం వరకు చాలా పనులు దీంతోనే చెక్కబెట్టేస్తున్నారు. అయితే, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలన్నా, లాకర్‌లో వస్తువులు దాయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. అయితే, ఏదైనా పని మీద బ్యాంకుకు వెళ్లాల్సి వస్తే.. ముందుగా ప్లాన్‌ చేసుకోవాలి. తీరా ఆ రోజు సెలవు అని తెలిస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కాబట్టి బ్యాంకు శాఖలు పనిచేసే రోజులు తెలుసుకోవాలి. తాజాగా కొత్త ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి, మహా శివరాత్రి, దీపావళి వంటి పండగలు, ఆదివారాలు, ప్రతి నెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. ఆయా రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయా స్థానిక పండగలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి.

2023లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులివే..
జనవరి 15 (ఆదివారం) - సంక్రాంతి
జనవరి 26 (గురువారం) - గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 18 (శనివారం) - మహాశివరాత్రి
మార్చి 07 (మంగళవారం) - హోలీ
మార్చి 22 (బుధవారం)- ఉగాది
మార్చి 30 (గురువారం)- శ్రీరామనవమి
ఏప్రిల్‌ 01 (శనివారం) - ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
ఏప్రిల్‌ 05 (బుధవారం)- జగ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్‌ 07 (శుక్రవారం) - గుడ్‌ ఫ్రైడే
ఏప్రిల్‌ 14 (శుక్రవారం) - అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్‌ 22 (శనివారం) - రంజాన్‌
మే 01 (సోమవారం) - కార్మిక దినోత్సవం
జూన్‌ 29 (గురువారం) - బక్రీద్‌
జులై 29 (శనివారం)- మొహర్రం 
ఆగస్టు 15 (మంగళవారం)- స్వాతంత్య్ర దినోత్సవం
సెప్టెంబర్‌ 07 (గురువారం) - శ్రీ కృష్ణాష్టమి
సెప్టెంబర్‌ 18 (సోమవారం) - వినాయక చవితి
సెప్టెంబర్‌ 28 (గురువారం) -  మిలాద్‌- ఉన్‌- నబి
అక్టోబర్‌ 02 (సోమవారం) - మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్‌ 24 (గురువారం) - విజయదశమి
నవంబర్‌ 12 (ఆదివారం) - దీపావళి
నవంబర్‌ 27 (సోమవారం) - కార్తీక పౌర్ణమి/గురునానక్‌ జయంతి
డిసెంబర్‌ 25 (సోమవారం)- క్రిస్మస్‌
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...