TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 20 July 2022

Baseline Test 2022 Model Papers, Registers

Baseline Test 2022 Model Papers, registerds Baseline Test July 2022 Papers with Guidelines and Instructions to conduct the baseline test Base Line Test 2022 Registers Base Line Test July 2022 Subject wise Marks Entry Forms  Base Line Test 2022 Telugu, Maths, English marks Proformas download in Excel, pdf Forms

 

BASELINE TEST INSTRUCTIONS: 

  • ప్రథమ్ ఫౌండేషన్ వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT' ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో   తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
  • బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.
  • ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.
  • పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.
  • ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్ బుక్లెట్లు ఇవ్వబడతాయి.
  • మరో ఐదు  పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి
  • ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన  నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.
  • ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి.
  • వీటిని విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి సెట్ 2,  మూడవ విద్యార్థికి సెట్ 3, వరుస క్రమంలో ఇవ్వాలి.
  • మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి.
  • తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి.
  • బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది.
  • మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష.
  • రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి.
  • మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి.
  • మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి.

బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు:

ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి. అవి: 

తెలుగు:-  ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి.

గణితం:- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు

ఇంగ్లీష్:- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు

Baseline Test 2022 Model Papers, Registers

📋బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు:

తెలుగు:

ఒక్కొక్క విద్యార్థిని పిలిచి  మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి. 

పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి పేరా స్థాయి ( స్థాయి - 4)  లో ఉన్నట్లుగా గుర్తించాలి. 

అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో  చదివితే ఆ విద్యార్థి కథా స్థాయి (స్థాయి 5) లో ఉన్నట్లుగా గుర్తించాలి. 

పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి. 

ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని పదాల స్థాయి (స్థాయి 3) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి  ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.  

ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి అక్షరాల స్థాయి (స్థాయి 2) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి (స్థాయి 1)   లో ఉన్నట్లు గుర్తించాలి. 
 
గణితం:

ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి ( స్థాయి - 1 )* లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఇచ్చిన  ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి. 

ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి ఒక అంకె సంఖ్యల స్థాయి ( స్థాయి - 2 ) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఇచ్చిన రెండు  అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి. 

ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థి రెండు అంకెల స్థాయి (స్థాయి - 3) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన  విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.  

చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను మూడంకెల స్థాయి ( స్థాయి - 4) లో ఉన్నట్లు గుర్తించాలి. 

చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను  సరిగ్గా చేసిన  విద్యార్థులను గణిత ప్రక్రియల స్థాయి (స్థాయి - 5)    లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఇంగ్లీష్:

ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్  లెటర్స్ ను  చదవమని విద్యార్థిని కోరాలి. 

ఐదు  కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి (స్థాయి - 1) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి. 

ఐదు స్మాల్  లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి కాపిటల్ లెటర్స్ స్థాయి (స్థాయి - 2 ) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి. 

ఐదు  సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి స్మాల్ లెటర్స్ స్థాయి (స్థాయి - 3) లో ఉన్నట్లు గుర్తించాలి. 

ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు  సులభ వాక్యాలు చదవమని కోరాలి.  

నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని పదాల స్థాయి  ( స్థాయి - 4)  లో ఉన్నట్లు గుర్తించాలి. 

నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి వాక్యాలు స్థాయి (స్థాయి - 5 )  లో ఉన్నట్లు గుర్తించాలి. 

ముఖ్య  గమనిక:  
  • ఇంగ్లీష్ టూల్ రెండు విభాగాలుగా ఉంటుంది. 1. చదవడం 2. అర్థంచేసుకోవడం 
  • కనుక ఐదు  పదాలలో నాలుగు   పదాలు చదవగలిగిన విద్యార్థిని ఆ పదాలకు అర్ధాలను వారి వాడుక భాషలో చెప్పమని కోరాలి. 
  • అదేవిధంగా నాలుగు వాక్యాలలో రెండు వాక్యాల యొక్క అర్ధాన్ని వారు మాట్లాడే వాడుక భాషలో చెప్పమని కోరాలి. 
  • మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని మీకు పంపిచబడిన ఫార్మెట్స్ ఆధారంగా రిజిస్టర్ నందు నమోదు చేయాలి..
  • Online లో Option enable చేసిన తరువాత ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.
రాత పరీక్ష:-
  • మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు  మాత్రమే  రాత పరీక్ష నిర్వహించాలి.
    ఫౌండేషనల్ పాఠశాల స్థాయి :
    • 2 నుండి 5 తరగతుల విద్యార్థులకు ప్రారంభపరీక్షలో రాత పరీక్షను నిర్వహించాలి.
    • 2 నుండి 5 తరగతులకు పది శాంపిళ్ళలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క ప్రశ్నా పత్రం ఇచ్చి రాత పరీక్ష నిర్వహించాలి. 11వ విద్యార్థికి 1వ శాంపిల్ 12వ విద్యార్థికి రెండవ శాంపిల్ ఇవ్వాలి.
    • 2 నుండి 5 తరగతులలో తెలుగు, ఇంగ్లీషులకు మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. గణితంలో మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలను రాత పరీక్షగా పరిగణించాలి.
    ఉన్నత పాఠశాల స్థాయి:
    • 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీషులలో రాత పరీక్ష నిర్వహించాలి. 
    • 10 శాంపిళ్ళలో ఒకటవ విద్యార్థికి 1వ శాంపిల్ 2వ విద్యార్థికి రెండో శాంపిల్ చొప్పున ఇవ్వాలి. తిరిగి 11వ విద్యార్థికి విషయం 1వ శాంపిల్ 12వ విద్యార్థికి రెండవ శాంపిల్ వస్తుంది.
    రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి. అవి 

    1. అసలు ఏమీ రాయని / చేయని వారు  
    2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే  
    3. రెండు మాత్రమే సరిగా రాశారు. 
    4. అన్నీ సరిగ్గా రాశారు.

    • ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి.
    • తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
    • ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు  ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది.
    •  ఈనెల 22 నాడు అన్ని తరగతులకు నిర్వహించబోయే బేస్ లైన్ టెస్ట్ శాంపిల్ పేపర్లను విడుదల చేశారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల్లో టెస్ట్ నిర్వహించబడుతుంది.


    Download Base Line Test July 2022 Model Papers:


    Baseline Test 2022 Instructions in Telegu
    Do you have any doubts? Join Our WhatsApp Group
    Hello, How can I help you? ...
    Click me to Join Group and chat...