TRENDING NOW

TIS Login Link How to Update TIS

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 18 August 2021

AP Schools New Timings, Time Tables for Satellite Foundation, Foundation, Foundation Plus, Pre-High Schools, High Schools, High School Plus

AP Schools New Timings, Time Tables for Satellite Foundation Schools, Foundation Schools, Foundation Plus Schools, Pre-High Schools, High Schools, High School Plus

 ఆంధ్రప్రదేశ్ లో స్థాయి వారీగా పాఠశాలలు:

ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, సీనియర్ సెకండరీ పాఠశాలలు అని 4 రకాలుగా ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంతో నడుస్తున్న పాఠశాలలు ఈ సంవత్సరం నుండి కింది విధంగా మార్చబోతున్నారు.

పూర్వ ప్రాథమిక విద్య నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించటం జరిగింది.

అవి: 1. ఫౌండేషనల్ పాఠశాలలు 
          2. హై స్కూల్స్

ఫౌండేషనల్ పాఠశాలలు: పూర్వ ప్రాథమిక విద్య పిపి-1, పిఏ-2 మరియు 1,2 తరగతులకు ఫౌండేషన్ పాఠశాలలుగా గుర్తించడం జరిగింది. అయితే ఆయా స్థానిక పరిస్థితులు, పాఠశాలల అందుబాటు, పాఠశాలలకు వెళ్ళుటలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫౌండేషన్ పాఠశాలలను 3 రకాలుగా విభజించడం జరిగింది.

1. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్: ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు లేని ఆవాస ప్రాంతాలో పిపి-1, పిపి-2 తరగతులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో 3 నుండి 4 సం||ల వయస్సు గల పిల్లలు విద్యనభ్యసిస్తారు.

2. ఫౌండేషనల్ పాఠశాలలు: ఈ పాఠశాలల్లో పిపి-1, పిపి-2, 1, 2 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల ఉండి 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలపడానికి వీలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 3 నుండి 8 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

3. ఫౌండేషనల్ ప్లస్ స్కూల్: ఈ పాఠశాలల్లో పిపి-1, పిపి-2, 1, 2, 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉండి సమీపంలోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలకు 3, 4, 5 తరగతులను కలుపుటకు సాధ్యం కాని ఆవాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 3 నుండి 10 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

2. హై స్కూల్స్:

1. ప్రీ-హైస్కూల్స్: ఈ పాఠశాలల్లో 3వ తరగతి నుండి 7 లేదా 8వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 సం|| నుండి 13 లేదా 14 సం||ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

2. హై స్కూల్స్: ఈ పాఠశాలల్లో 3 నుండి 10వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలున్న ఆవాస ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 15 సం॥ల పిల్లలు విద్యనభ్యసిస్తారు. 

3. హై స్కూల్ ప్లస్: ఈ పాఠశాలల్లో 3 నుండి 12వ తరగతి వరకు ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు ఉన్న ఆవాస ప్రాంతాలలో అవసరం ఉన్నచోట 11, 12 తరగతులను కలిపి వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులో 7 నుండి 17 సం॥ల పిల్లలు విద్యను అభ్యసిస్తారు.

వివిధ రకాల పాఠశాలలు-కాలనిర్ణయ పట్టికలు:

Satellite Foundation Schools - PP 1 and PP 2 శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలోని పిపి-1 మరియు పిపి-2

Foundation Schools - From Class 1 to Class 2 ఫౌండేషన్ స్కూల్లోని 1వ తరగతి నుండి 2వ తరగతి వరకు

Foundation Plus Schools - From Class 1 to Class 5 ఫౌండేషన్ ప్లస్ స్కూల్లోని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు

Pre-High Schools - From Class 3 to Class 7 / 8 ఉన్నతపూర్వ పాఠశాల 3వ తరగతి నుండి 7/8వ తరగతి వరకు

High Schools - From Class 3 to Class 10 ఉన్నతపూర్వ పాఠశాల 3వ తరగతి నుండి 7/8వ తరగతి వరకు

High School Plus - From Class 3 to Class 12 ఉన్నత పాఠశాల ప్లస్ 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు

Download All Schools Complete Time Table

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...