WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 25 August 2021

AGRICET 2021 Polytechnic Diploma Courses Admissions 2021-21 Notification, Fee Payment, Schedule, Online Application

AGRICET 2021 Agriculture, Seed Technology, Organic Farming, Animal Husbandry, Fisheries Polytechnic Diploma Courses Admissions 2021-21 Notification, Fee Payment, Schedule, Online Application

Seeking of applications for admission into 2 / 3 year diploma courses of ANGRAU, SVVU and Dr YSRHU for academic year 2021-22 is released. Candidates are instructed to read the instructions/guidelines mentioned in the Information Brochure and keep all relevant documents ready before applying.

రెండు సంవత్సరాల వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞానం / సేంద్రియ వ్యవసాయ/ పశుపోషణ/మత్స్యశాస్త్ర/హార్టీకల్చరల్ డిప్లొమా కోర్సులు మరియు మూడు సంవత్సరాల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు కొరకు ప్రవేశము

ఉపోద్ఘాతం:

గ్రామ సీమలలో నివశించే యువతీ యువకులు వారు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశ్యంతోను, వారు కాలేజీలలో చేరి డిగ్రీలు చదువలేరనే ఉద్దేశ్యంతో వారికి వ్యవసాయ, సింద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానము. వ్యవసాయ ఇంజనీరింగ్, ఉద్యాన, పశుపోషణ మరియు మత్స్యశాస్త్రం లలో శిక్షణనివ్వడానికి గాను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి మరియు డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం వారు ఆయా పాలిటెక్నిక్ లను ఏర్పాటు చేయడమైనది. అదీకాక, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో - వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో పని చేయడానికి సిబ్బంది అవసరం ఎంతైనా ఉన్నది.

2020-21 విద్యాసంవత్సరము నుండి మునిసిపల్ పరిధి లో చదువుకున్న విద్యార్ధులకు కూడా ప్రవేశములు కల్పించుటకు నిర్ణయించడమైనది. పంచాయితీ పరిధి (నాస్ మునిసిపల్ పరిధి) పాఠశాలలో చదివిన వారికి మరియు మునిసిపల్ పరిధి పాఠశాలలో చదివిన వారికి మధ్య 75:25 ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగును.

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్రింద పేర్కొనబడిన ప్రాంతాలలో రెండు సంవత్సరముల - వ్యవసాయ, నిత్తన సాంకేతిక పరిజ్ఞాన, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులు మరియు మూడు సంవత్సరముల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు ప్రారంభించబడినవి. 

2021-22 విద్యాసంవత్సరం నుండి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు వారిచే నిర్వహించబడుతున్న అన్ని డిప్లొమా కోర్సులు ఇంగ్లీషు బోధన మాధ్యమంగా నిర్వహింపబడును.

అర్హత:

ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్ధులు వారి పది సంవత్సరముల చదువు కాలంలో కనీసం నాలుగు సంవత్సరములు గ్రామీణ ప్రాంతాలలోని (నాస్ మునిసిపల్ పరిధి) పాఠశాలలో చదివిన వారికి మరియు మునిసిపల్ పరిధి పాఠశాలలో చదివిన వారికి మధ్య 75:25 ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగును. దీనికి గాను దరఖాస్తు ఫారానికి జతపరచబడిన ఫారం 1 ప్రకారం వారు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారితో పూరించి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారుగా ధృవపరచాలి. ఫారం 1 పూర్తి చేయని అభ్యర్ధులను మునిసిపల్ పరిధికి చెందిన వారిగా పరిగణించి, పైన తెలుపబడిన నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించబడును. పదవ తరగతి, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. పదవ తరగతి కంపార్ట్మెంట్ లో ఉత్తీర్ణులైన మరియు ఇంటర్మీడియేట్ తప్పిన (ఫెయిలైన అభ్యర్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియేట్ పాసైనవారు దానికంటే పై చదువులు చదివిన వారు అర్హులు కారు.

ముఖ్య గమనిక: విశ్వవిద్యాలయ మరియు విశ్వవిద్యాలయములచే గుర్తింపబడిన పాలిటెక్నిక్ ల సంఖ్య మరియు సీట్ల సంఖ్య కౌన్సిలింగ్ సమయానికి యూనివర్శిటీల నిర్ణయము ప్రకారము పెరగవచ్చును లేదా తగ్గవచ్చును.

ఎంపిక విధానము:

ఎ) గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ ప్రకారం విద్యార్ధి యొక్క ఎంపిక నిర్ణయించబడును.

బి) ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది అభ్యర్ధులకు సమానమైన గ్రేడు పాయింట్ ఏవరేజ్ వస్తే వారికి సబ్జక్టులలో వచ్చిన గ్రేడ్ యింట్ ప్రకారం క్రింది విధముగా అభ్యర్థుల ఎంపిక జరుపబడును. 

i) సమాన గ్రేడ్ పాయింట్ ఏవరేజి వచ్చినప్పుడు మొదట సైన్సులోను, తరువాత గణితం, ఇంగ్లీషు, తెలుగు, సోషల్ మరియు హిందీ లో ఉండే గ్రేడ్ పాయింట్లను బట్టి నిర్ణయించబడును. 

ii) తర్వాత అభ్యర్థి యొక్క పుట్టిన తేదీని ప్రాతిపదికగా పరిగణించబడును.

వయస్సు:

డిప్లొమా కోర్సులో చేరబోవు అభ్యర్థి 31.08.2021 నాటికి 15-22 సంవత్సరముల మధ్య వయస్కుడై ఉండాలి. (31.08.1999 తరువాత మరియు 31.08.2006 లోపు జన్మించిన వారై ఉండాలి.)

8. కోర్సుల కాలపరిమితి:

ఎ) వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానము, ఉద్యాన, పశుపోషణ, మత్స్యశాస్త్ర డిప్లొమా ల కాల పరిమితి రెండు సంవత్సరములు మరియు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కాల పరిమితి మూడు సంవత్సరములు. ప్రతి సంవత్సరములో రెండు సెమిస్టర్లు ఉండును.

9. హాస్టలు వసతి:

ఈ కోర్సులలో ప్రవేశము పొందిన వారికి హాస్టల్ లో వసతి ఉన్నంత మేరకు మాత్రమే రూములు ఇవ్వబడును. బయట ఉండదలచినట్లైతే ప్రిన్సిపాల్ గారి వద్ద ముందుగా అనుమతి పొందాలి.

జతపరచవలసిన ధృవీకరణ పత్రాలు (జిరాక్సు కాపీలు మాత్రమే):

1. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ కాని దానితో సమానమైన పరీక్షలో కాని ఉత్తీర్ణత ధృవ పత్రము 

2. వెనుకబడిన తరగతులు, EWS, ఎస్.సి., ఎస్.టి లకు చెందినవారైతే అందుకు సంబంధించిన ఇటీవల కాలంలో తీసుకున్న ధృవీకరణ పత్రము జతపరచాలి. ఈ కోటాల క్రింద దరఖాస్తు చేసిన వారు, తత్సంబంధిత ప్రభుత్వ డైరెక్టరేట్ వారు ధృవీకరించిన పిదప మాత్రమే ప్రవేశ పత్రం జారీ చేయబడును.

3. దరఖాస్తు ఫారంలో 10 కాలమ్ కు అవసరమైన బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్స్ జతపరచాలి..

గమనిక: గుర్తింపు పొందిన విద్యా సంస్థలలో వేరు వేరు గా అధ్యయనం చేసిన విద్యార్ధులు ఆయా సంబంధిత విద్యా సంస్థల అధిపతుల నుండి జారీ చేయబడిన ధృవీకరణ పత్రాలనే జతపరచాలి.

4. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వారి ధృవపత్రం (ఫారం - 1)

5. పదవ తరగతి చదివిన పాఠశాల నుండి బదిలీ పత్రం (Transfer Certificate)

6. స్వాభావికమైన ప్రతిబంధకము కలవారైతే (PH) ఆ దృవీకరణ పత్రం

7. ఎక్స్ సర్వీస్ మెన్ / సర్వీస్ మెన్ అయినట్లయితే ఆ ధృవీకరణ పత్రం 

8. ఎన్.సి.సి. లో పాల్గొంటే ఆ ధృవీకరణ పత్రం

9. క్రీడలలో పాల్గొంటే ఆ దృవీకరణ పత్రం (రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి మాత్రమే) ఆదాయ ధృవీకరణ పత్రం

10. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ ఆన్ లైన్ పేమెంట్ (నెట్ బ్యాంకింగ్ / డెబిట్ కార్డ్ ద్వారా) Rs. 600/ (ఎస్.సి., ఎస్.టి. మరియు PH అభ్యర్థులకు Rs. 300/-)

11. అడ్మిషన్ కై ఎంపిక చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో ఈ క్రింది ఒరిజినల్ ధృవ పత్రాలను దఖలు చేయాలి.

అడ్మిషన్ కై ఎంపిక చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో ఈ క్రింది ఒరిజినల్ ధృవ పత్రాలను దఖలు చేయాలి:

1. చదివిన స్కూలు నుండి ధృవీకరణ పత్రం

2. పదవ తరగతి చదివిన పాఠశాల నుండి బదిలీ పత్రం (Transfer Certificate)

3. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ కాని దానితో సమానమైన పరీక్షలో కాని ఉత్తీర్ణత ధృవ పత్రము

4. వెనుకబడిన తరగతులు, EWS, ఎస్.సి., ఎస్.టి లకు చెందినవారైతే అందుకు సంబంధించిన ఇటీవల కాలంలో తీసుకున్న ధృవీకరణ పత్రము.

5. స్వాభావికమైన ప్రతిబంధకము కలవారైతే (PH) ఆ ధృవీకరణ పత్రం 

6. ఎన్.సి.సి. లో పాల్గొంటే ఆ దృవీకరణ పత్రం

7. క్రీడలలో పాల్గొంటే ఆ ధృవీకరణ పత్రం (రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి మాత్రమే)

8. ఎక్స్ సర్వీస్ మెన్ / సర్వీస్ మెన్ అయినట్లయితే ఆ ధృవీకరణ పత్రం 

9. ఆదాయ ధృవీకరణ పత్రం

విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విద్యను నేర్పుటకు, పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాలు చేపట్టుటకు నిర్దేశించబడినవి. కాబట్టి విశ్వవిద్యాలయాలలో కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు ఉపాధి కల్పించే హామీని ఇవ్వడం లేదు.

ప్రకటన (నోటీస్) ఇవ్వకుండా నిబంధనలను మార్చడం కానీ, రద్దు చేయటం కాని చేసే అర్హత విశ్వవిద్యాలయాలకు రిజర్వు చేయబడినది.

Download Notification, Prospectus | Online Application

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...