WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Friday 9 July 2021

AP Common Entrance Tests AP CETS Schedule, Dates

AP Common Entrance Tests AP CETS Schedule, Dates for APEAP CET 2021, AP ICET 2021, AP ECET 2021, AP EDCET 2021, AP LAWCET 2021, AP PGECET 2021

ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ను సెప్టెంబర్ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19న ఈసెట్ (అనంతపురం జేఎన్టీయూ), సెప్టెంబర్ 21న ఎడ్సెట్ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి.

తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న లాసెట్, సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈఏపీ సెట్: ఆగస్టు 19 నుంచి 25 వరకు

ఐసెట్: సెప్టెంబర్ 17, 18న

ఈసెట్: సెప్టెంబర్ 19న

ఎడ్ సెట్: సెప్టెంబర్ 21న 

లాసెట్: సెప్టెంబర్ 22న

పీజీఈ సెట్: సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...