WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 7 June 2021

Jagananna Vidya Kanuka JVK Kits 2021 - Receiving, Distribution Guidelines

Jagananna-vidya-kanuka-jvk-kits-2021-recieving-distribution-guidelines-to-hms-meos-complex-hms-teaches-crps

ఆర్.సి. నెం. SS-16021/3/2021-CMO SEC - SSA తేది: 07-06-2021

సమగ్రశిక్షా 'జగనన్న విద్యా కానుక' 2021-22 - విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు - సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

ఆదేశములు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్రశిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా గమనించవలసిన విషయాలు:

  • 'జగనన్న విద్యా కానుక'లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.
  • 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్/ మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి.
  • 'జగనన్న విద్యాకానుక'లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు 4031 స్కూల్ కాంప్లెక్స్ కు, యూనిఫాం క్లాత్ 670 మండల రిసోర్సు కేంద్రాలకు అందజేస్తారు.
  • సరుకు స్కూల్ కాంప్లెక్సుకు/ మండల రిసోర్సు కేంద్రానికి వచ్చేముందు సప్లయర్స్ సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు/ మండల విద్యాశాఖాధికారి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.
  • అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది.
  • కిట్ కు సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి? ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.
  • సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
  • సప్లయర్స్ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి స్కూల్ కాంప్లెక్సులో లేదంటే దగ్గరలోని భద్రతా ప్రమాణాలు కలిగిన పాఠశాలలో భద్రపరచాలి.
  • సంబంధిత కేంద్రానికి చేరిన సరుకు భద్రపరిచే గది వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి..
  • మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సుకు చేరిన మెటీరియల్ నందలి అన్ని రకాల వస్తువులను పరిశీలించవలసి ఉంటుంది. (ఉదాహరణకు నోటు పుస్తకాలకు సంబంధించి వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా అన్ని రకాల నోటు పుస్తకాలు పరిశీలించాలి. అలాగే అన్ని రకాల బ్యాగులు, బెల్టులు మరియు బూట్లు & సాక్సులు, యూనిఫాం క్లాత్ పరిశీలించాల్సి ఉంటుంది.)
  • ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సుకు సరుకు తగినంత అందిందో లేదో సరిచూసుకోవాలి.
  • ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు అందజేసే మెటిరీయల్ నందలి వివిధ రకాల వస్తువులు కార్టన్లు/ సంచులు/ప్యాకెట్ల రూపంలో చేరతాయి. అందులో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్/ సంచి/ ప్యాకెట్ను పూర్తిగా పరిశీలించాలి. 
  • యూనిఫాం క్లాత్ మండల రిసోర్సు కేంద్రానికి ప్యాకెట్లతో కూడిన బేల్ రూపంలో చేరుతాయి. 
  • స్కూల్ కాంప్లెక్స్నకు అందజేసిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించిన యెడల సంబంధిత
  • మండల విద్యాశాఖాధికారి వారికి వెంటనే తెలియజేయవలసి ఉంటుంది. మండల రిసోర్సు కేంద్రం నందు చేరిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించిన యెడల
  • సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి/ సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి వెంటనే సమాచారం అందించవలసి ఉంటుంది.
  • బ్యాగులు అందిన తర్వాత 'అనుబంధం-2'లో పేర్కొన్న విధంగా తరగతి వారీగా వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి.
  • ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధంగా విద్యార్థులకు వెంటనే అందజేయగలిగే విధంగా కిట్లు సన్నద్ధంగా ఉంచాలి.
  • సంబంధిత మండల రిసోర్సు కేంద్రం నుంచి సరుకును కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి. (కిట్ల తయారీ కోసం అవసరం మేరకు కూలీలను పెట్టుకుని బిల్లు పెట్టుకోవచ్చు.)
  • తరగతి వారీగా ఏ విద్యార్థికి ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వాలో 'అనుబంధం-2'లో పొందుపరచడమైనది. 
  • ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.
స్టాకు రిజిస్టర్ నిర్వహణ:
  • ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో తప్పనిసరిగా 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి. స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
  • రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సుకు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్ తప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.
డెలివరీ చలానాలు:
  • ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో 'జగనన్న విద్యాకానుక'కు సంబంధించి వస్తువులు వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్న తర్వాత చలానాల్లో సంతకాలు పెట్టాలి.
  • సప్లయిర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
  • సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారి సంతకం, వస్తువులు తీసుకున్న తేదీ తప్పక ఉండేలా చూసుకోవాలి.
లాగిన్లలో నమోదు:
  • 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాలు 'జగనన్న విద్యా కానుక'యాప్ నందు నమోదు. చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు సంబంధిత జిల్లాలకు పంపడం జరిగింది. రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. 
  • పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగాఆదేశించడమైనది.
దీనితో పాటు 'అనుబంధం-1', 'అనుబంధం-2' జతపరచడమైనది.

Download JVK Kits Receiving, Distribution Guidelines
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...