TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday 9 May 2020

FAC Arrangements to the post of HMs / MEOs - Sanction of FAC allowance Guidelines

Full Additional Charge - FAC Allowance to HMs / MEOs:
         As per the FR. 49 (1), the Head of the Department is the competent authority to sanction FAC allowance for the period of 1st three months @ 1/5th of substantive pay and @ 1/10th of substantive pay beyond three months for keeping Full Additional Charge for the post of Head Master/Head Mistress/MEO. 
  • విద్యాశాఖలో చాలామంది టీచర్లు, హెచ్ఎంలు పూర్తి అదనపు బాధ్యతలతో FAC HMలుగా… FAC MEOలుగా పనిచేస్తున్నారు. ఇలా Full Additional Charge (FAC) బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి FR 49 ప్రకారం FAC అలవెన్సు చెల్లిస్తారు. 
  • 14 రోజులకు మించి పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించినప్పుడు మాత్రమే FAC అలవెన్సు చెల్లిస్తారు.
  • మొదటి మూడు నెలలు 1/5 వంతు పే అండ్ అలవెన్సుస్ ని FAC అలవెన్సు గా చెల్లిస్తారు.
  • తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సుస్ చెల్లిస్తారు. దానిపై డిఏ, హె.ఆర్.ఎ కూడా అనుమతించ బడతాయి.
  • ఒకరోజు గ్యాప్ తో మళ్ళీ అదనపు బాధ్యతలు చేపడితే, మళ్ళీ మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు పే అండ్ అలవెన్సులను FAC Allowance గా చెల్లిస్తారు.
  • మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు Head of Department (HOD) జారీచేస్తారు. అయితే, పాఠశాల విద్యాశాఖలో పనులు సత్వరం కావాలన్న సదుద్దేశ్యంతో HOD ఐన కమీషనర్ Rc No 1827/C3-2/2009 తేదీ: 25.11.2010 ద్వారా తనకున్న ఈ అధికారాలను RJD(SE)లకు బదలాయించినందున…. మొదటి మూడు నెలల FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులు RJD(SE)లు జారీచేస్తున్నారు.
  • Next Three Months FAC అలవెన్సు మంజూరు ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వమే జారీచేస్తుంది.
  • ఒక హైస్కూల్ హెడ్మాస్టర్ ఒక మండలానికి FAC MEOగా పనిచేసిన పిదప…. కొన్ని రోజులు లేదా నెలల విరామంతో అదే మండలానికి లేదా వేరే మండలానికి FAC MEOగా పనిచేస్తే… రెండు (విడతలు) మండలాల్లో FAC అలవెన్సు చెల్లించాల్సిందే. వేర్వేరు పీరియడ్లో ఒకటికి మించి కార్యాలయాల్లో పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తే…. ప్రతి పూర్తి అదనపు బాధ్యతలకు మొదటి మూడు నెలలు 1/5 వంతు, తదుపరి మూడు నెలలు 1/10 వంతు FAC అలవెన్సు విధిగా చెల్లించాల్సిందే. ఇలా ఒకటికి మించి అదనపు బాధ్యతలను వేర్వేరు సమయాల్లో నిర్వర్తించిన హెచ్ఎంలు/ఎంఈవోలకు FAC అలవెన్సు మంజూరుకు పైఅధికారులకు ప్రతిపాదనలు పంపాలి.
• Download Delegation of Powers to Sanction of FAC allowance R.c.No. 1827 Dt:25-11-2010
• Download Sanction of FAC Allowance to HM in Municipal Schools - Delegation of Powers instructions Roc.No.11021

Required documents to Claim FAC Allowance:

• FAC Orders issued by DEO / RJD
• Ratification Proposals from RJDSE
• Application of the Individual - Download
Non-drawl Certificate - Download
• Non availment of EOL - Download
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...