TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 24 March 2020

Aadhar -PAN Linking, IT Returns Filing Last Date Extended, ATM Withdrawal from any bank’s ATM will be free of charge

ఆధార్‌- పాన్‌ అనుసంధానం,  ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు, ఏటీఎంల్లో నగదు విత్‌డ్రాపై ఛార్జీలుండవు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.

     Aadhaar-PAN linking date has been extended to June 30, 2020 from what was March 31, 2020.

    దిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. ఆధార్‌ పాన్‌ అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. టీడీఎస్‌ జమలో ఆలస్య రుసుము 18 నుంచి 9శాతానికి తగ్గించడంతో పాటు  వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపులో 10 శాతం అదనపు రుసుం ఉండదన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు సైతం గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్టు నిర్మలాసీతారామన్‌ స్పష్టంచేశారు.

        Last date for filing March, April and May 2020 returns is being extended to June 30, 2020. Different staggering dates will be applicable, but all will be end of June.
      కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌ నెలకొన్న నేపథ్యంలో 2018- 19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు gsrmaths.in గడువు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ గడువును జూన్‌ 30 2020 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికే లాక్‌డౌన్
www.gsrmaths.in విధించినట్టు చెప్పారు.  ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందన్న ఆమె.. ఆర్థిక సంవత్సరం చివరు రోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందన్నారు.
    
      FM Nirmala Sitharaman has clarified that banks not imposing the minimum balance requirement fee is for a three-month period, for now.

    ATM withdrawal from any bank’s ATM will be free of charge for the next three months. Also, there shall not be any minimum balance requirement fee.

 బ్యాంక్‌ ఖాతాదారులు అన్ని ఏటీఎంల్లో నగదు ఉపసంహరించుకోవచ్చని, మూడు నెలలపాటు ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బ్యాంకుల్లో కనీస నగదు నిల్వ ఉంచాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. స్టాక్‌మార్కెట్లలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు, ఆర్థిక అంశాలపై ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. 
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...