WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 28 July 2016

ఏపీలో 4548 పోలీసు ఉద్యోగాలు -అర్హత‌లు - ఎంపిక - సిల‌బ‌స్ -ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్ష- ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టు - ఫైన‌ల్ ప‌రీక్ష - పూర్తి వివరాలు


ఏపీలో 4548 పోలీసు ఉద్యోగాలు

*CLICK HERE FOR DETAILED NOTIFICATION, SYLLABUS, EXAM PATTERN AND VACANCIES                      *CLICK HERE FOR APPLY ONLINE              

               ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ పోలీస్ నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 4548 పోస్టుల భర్తీకి డీజీపీ జేవీ రాముడు విజయవాడలో ప్రక‌ట‌న విడుద‌ల‌చేశారు. 3216 సివిల్‌ కానిస్టేబుల్‌, 1067 ఆర్మ్‌డ్‌ రిజర్వుడు కానిస్టేబుల్‌, జైళ్లలో 240 పురుష వార్డర్‌, 25 మహిళా వార్డర్‌ పోస్టులను ఈ ప్రక‌ట‌న ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 16న ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. సివిల్ మొత్తం ఖాళీల్లో 33.33 శాతం, ఏఆర్ ఖాళీల్లో 20 శాతం పోస్టుల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించారు. ఒక‌వేళ అర్హులైన మ‌హిళా అభ్యర్థులు లేక‌పోతే ఆ పోస్టుల‌ను పురుషుల‌తో భ‌ర్తీ చేస్తారు.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 3 ఉద‌యం 10 గంట‌ల నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: సెప్టెంబ‌రు 14 సాయంత్రం 5 వ‌ర‌కు
ప్రాథ‌మిక ప‌రీక్ష: అక్టోబ‌రు 16 (ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు)
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌, బీసీ అభ్యర్థుల‌కు రూ.300; ఎస్సీ, ఎస్టీలైతే రూ.150.
వెబ్‌సైట్‌: http://recruitment.appolice.gov.in
అర్హత‌లు...
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి 18-22 ఏళ్లలోపు వ‌య‌సువారై ఉండాలి. ( జులై 2, 1994- జులై 1, 1998 మ‌ధ్య జ‌న్మించిన‌వారే అర్హులు). 360 రోజుల‌కు త‌క్కువ కాకుండా హోమ్ గార్డులుగా ప‌నిచేస్తున్నవారికి గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి 30 ఏళ్లు. వార్డర్ పోస్టుల‌కు 18-30 ఏళ్ల వ‌య‌సువాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో అయిదేళ్ల స‌డిలింపు ఉంది.
విద్యార్హత‌: ఇంట‌ర్ లేదా స‌మాన అర్హత ఉన్న కోర్సును జులై 1, 2016 నాటికి పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా(పాలిటెక్నిక్) కోర్సులు పూర్తిచేసుకున్నవాళ్లు కూడా అర్హులే. ఎస్సీ, ఎస్టీలైతే ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై, ఇంట‌ర్ అనుత్తీర్ణులైన‌ప్పటికీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే వీళ్లు ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరాల ప‌రీక్షలు మాత్రం ఇప్పటికే రాసిన‌వారై ఉండాలి.
లోక‌ల్‌-నాన్ లోక‌ల్‌: 
అభ్యర్థులు నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు అంటే ఏడేళ్ల విద్యాభ్యాసంలో క‌నీసం నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చ‌దివారో ఆ జిల్లా ఆ అభ్యర్థికి లోక‌ల్ అవుతుంది.
ద‌ర‌ఖాస్తులు...
అభ్యర్థులు మీసేవ‌(ఈసేవ‌) ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్ సెంట‌ర్లలో ఛైర్మన్‌, స్టేట్‌లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫీజు చెల్లించాలి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబ‌ర్‌, కులం, ప‌దోత‌ర‌గ‌తి హాల్‌టికెట్ నంబ‌రు...ఈ వివ‌రాలు న‌మోదుచేయించుకోవాలి.
మీసేవ‌(ఈసేవ‌) ఏపీ ఆన్‌లైన్ లేదా టీఎస్ ఆన్‌లైన్ నుంచి పేమెంట్ రిసీప్ట్ తీసుకున్నత‌ర్వాతhttp://recruitment.appolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివ‌రాలు న‌మోదుచేసుకోవాలి.
ఎంపిక ఇలా..
ముందుగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన‌వారికి ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్టులు ఉంటాయి. వీటిని విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్న వారికి ఫైన‌ల్ ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా, మెరిట్‌, రిజర్వేష‌న్ల ప్రాతిప‌దిక‌న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.
ఇదీ సిల‌బ‌స్ 
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ప్రిలిమ్స్‌, మెయిన్స్ సిల‌బ‌స్ ఒక‌టే. ప్రశ్నల‌న్నీ ఇంట‌ర్ స్థాయిలో ఉంటాయి. ఇంగ్లిష్‌, అర్థమెటిక్‌, జ‌న‌ర‌ల్ సైన్సు, భార‌త‌దేశ చ‌రిత్ర, భార‌తీయ సంస్కృతి, భార‌త‌స్వాతంత్రోద్యమం, భార‌త‌ భూగోళం, పాలిటీ, ఎకాన‌మీ, జాతీయ‌, అంతర్జాతీయ ప్రాధాన్యం సంత‌రించుకున్న వ‌ర్తమానాంశాలు, రీజ‌నింగ్‌/ మెంట‌ల్ ఎబిలిటీ అంశాల్లో ప్రశ్నలు వ‌స్తాయి.
ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్ష ఇలా...
ప్రశ్నప‌త్రం 200 మార్కుల‌కు ఉంటుంది. మూడు గంట‌ల వ్యవ‌ధిలో 200 ప్రశ్నల‌కు జ‌వాబులు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు ఒక‌మార్కు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నల‌న్నీ బ‌హుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. అభ్యర్థులు స‌మాధానాలను ఓఎంఆర్ ప‌త్రంపై నింపాలి. ఇందుకోసం న‌లుపు లేదా నీలి రంగుల్లో రాసే పెన్నులు ఉప‌యోగించుకోవ‌చ్చు. అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు పూరించిన‌ప్పుడే తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ వీటిలో ఏ మాధ్యమంలో ప‌రీక్ష రాయాల‌నుకుంటున్నారో న‌మోదు చేసుకోవాలి.
అర్హత సాధించ‌డానికి... 
ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్షలో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 40 శాతం(80 మార్కులు), బీసీలు 35 శాతం (70 మార్కులు), ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం (60 మార్కులు) పొంద‌డం త‌ప్పనిస‌రి. తుది నియామ‌కాల్లో ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.
ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టు
ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో అర్హత సాధించిన‌వారికి ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎత్తు, బ‌రువు, ఛాతీ విస్తీర్ణం(పురుష అభ్యర్థుల‌కు), వినికిడి సామ‌ర్థ్యం, కంటిచూపు...ఇవ‌న్నీ ప‌రిశీలిస్తారు.
సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టుల‌కు దర‌ఖాస్తు చేసుకున్న పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చిన‌ప్పుడు 86.3 సెం.మీ. ఉండాలి. ఊపిరి వ‌దిలి, పీల్చిన‌ప్పుడు ఛాతీ విస్తీర్ణంలో వ్యత్యాసం 5 సెం.మీ. ఉండాలి. మ‌హిళ‌లైతే 152 సెం.మీ. ఎత్తు, క‌నీసం 40 కిలోల బ‌రువు ఉండాలి. వార్డర్ పోస్టుల‌కు పురుష అభ్యర్థులు 168 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం ఊపిరి పీల్చిన‌ప్పుడు 87 సెం.మీ. త‌ప్పనిస‌రి. ఊపిరి వ‌దిలిన‌ప్పుడు 5 సెం.మీ. త‌గ్గాలి. మ‌హిళ‌లైతే 153 సెం.మీ. ఎత్తు, 45.5 కిలోల బ‌రువు ఉండాలి.
ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు(సివిల్, వార్డర్ పోస్టుల‌కు)
ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్టులో అర్హుల‌కు ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టులు నిర్వహిస్తారు. సివిల్‌, వార్డర్ పోస్టుల‌కైతే ముందుగా 1600 మీట‌ర్లు అంటే ఒక మైలు (1.6 కి.మీ.) ప‌రుగుపందెం నిర్వహిస్తారు. పురుషులైతే ఈ దూరాన్ని 8 నిమిషాల్లో పూర్తిచేయాలి. మ‌హిళా అభ్యర్థులు 10 నిమిషాల 30 సెకెన్లలోగా పూర్తిచేయాలి. ఇందులో అర్హత సాధించిన‌వారికి వంద మీట‌ర్ల ప‌రుగుపందెం ఉంటుంది. ఈ దూరాన్ని పురుషులైతే 15 సెకెన్లలో, మ‌హిళ‌లు 18 సెకెన్లలోగా చేరుకోవాలి. అనంత‌రం లాంగ్‌జంప్ నిర్వహిస్తారు. పురుషులైతే 3.8 మీట‌ర్ల దూరానికి జంప్ చేయాలి. మ‌హిళ‌లైతే 2.75 మీట‌ర్ల దూరానికి జంప్ చేయాలి. సివిల్ కానిస్టేబుల్‌, జైల్ వార్డర్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు కేవ‌లం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో మార్కులు ఉండ‌వు.
ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు(ఏఆర్ పోస్టుల‌కు)
ఏఆర్ పోస్టుల‌కు మాత్రం ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టుకు కూడా మార్కులు కేటాయించారు. మూడు ఈవెంట్లకూ క‌లిపి వంద మార్కులు ఉన్నాయి. ఇందులో 40 మార్కులు 1600 మీట‌ర్ల ప‌రుగుకి, 30 మార్కులు 100 మీట‌ర్ల ప‌రుగుకి మ‌రో 30 మార్కులు లాంగ్‌జంప్‌కు కేటాయించారు. పురుష అభ్యర్థుల విష‌యంలో 1600 మీట‌ర్ల ప‌రుగును 4 నిమిషాల్లో పూర్తిచేస్తే 40 మార్కులు ద‌క్కుతాయి. 4 నిమిషాల 30 సెకెన్లలో పూర్తిచేస్తే 36 మార్కులు ఇలా ప్రతి 30 సెకెన్లు ఆల‌స్యం అయ్యే కొద్దీ 4 మార్కులు చొప్పున త‌గ్గిస్తారు. ఏడు నిమిషాల 30 సెకెన్ల నుంచి 8 నిమిషాల్లో పూర్తిచేసిన‌వారికి 15 మార్కులే ఉంటాయి. అలాగే వంద మీట‌ర్ల ప‌రుగుని కూడా 10.50 సెకెన్లలో పూర్తిచేసుకున్నవారికి 30 మార్కులు, 10.51 నుంచి 11 సెకెన్లలో పూర్తిచేసుకున్నవారికి 27 మార్కులు ఇలా ప్రతి .10 సెకెన్లకూ మూడేసే మార్కులు చొప్పున త‌గ్గుతాయి. 14.51 నుంచి 15 సెకెన్లలోపు పూర్తిచేసిన‌వారికి ప‌ది మార్కులే వేస్తారు. లాంగ్ జంప్ విష‌యంలోనూ అంతే. 5.6 మీ కంటే ఎక్కువ దూరం దూకితే 30 మార్కులు. 3.8 నుంచి 4 మీట‌ర్ల దూరానికి దూకితే 10 మార్కులు. ఏఆర్ పోస్టుల‌కు సంబంధించి మ‌హిళ‌ల విష‌యానికొచ్చేసరికి 1600 మీట‌ర్ల ప‌రుగును 6 నిమిషాల 30 సెకెన్లలో పూర్తిచేయ‌గ‌లిగితే 40 మార్కులు దక్కుతాయి. ప‌ది నిమిషాల నుంచి ప‌ది నిమిషాల 30 సెకెన్లలోగా పూర్తిచేస్తే 15 మార్కులు. వంద మీట‌ర్ల ప‌రుగును 13 సెకెన్లలో పూర్తిచేస్తే 30 మార్కులు, 17.51 నుంచి 18 సెకెన్లలోగా పూర్తిచేస్తే 9 మార్కులు ద‌క్కుతాయి. లాంగ్‌జంప్ విష‌యానికొచ్చేస‌రికి 4.31 మీట‌ర్లు లేదా అంత‌కంటే ఎక్కువ దూరం దూకేవారికి 30 మార్కులు, 2.75 నుంచి 2.9 మీట‌ర్లు దూకితే 11 మార్కులు ద‌క్కుతాయి.
ఫైన‌ల్ ప‌రీక్ష (సివిల్, వార్డర్ పోస్టుల‌కు)
ప్రిలిమిన‌రీ మాదిరిగానే మూడు గంట‌ల వ్యవ‌ధిలో 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నల‌న్నీ బ‌హుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. అభ్యర్థులు స‌మాధానాల‌ను ఓఎంఆర్ ప‌త్రంపై నింపాలి. ఇందుకోసం నీలం లేదా న‌లుపు రంగుల్లో రాసే పెన్నులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ప‌రీక్షలో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 40 శాతం(80 మార్కులు), బీసీలు 35 శాతం (70 మార్కులు), ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం (60 మార్కులు) పొంద‌డం త‌ప్పనిస‌రి.
ఫైన‌ల్ ప‌రీక్ష (ఏఆర్ పోస్టుల‌కు)
వీరికి 3 గంట‌ల వ్యవ‌ధిలో వంద మార్కుల‌కు ప‌రీక్ష నిర్వహిస్తారు. అయితే ప్రశ్నలు మాత్రం 200 ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు అర మార్కు. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రశ్నల‌న్నీ బ‌హుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. అభ్యర్థులు స‌మాధానాల‌ను ఓఎంఆర్ ప‌త్రంపై నింపాలి. ఇందుకోసం నీలం లేదా న‌లుపు రంగుల్లో రాసే పెన్నులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇందులో అర్హత సాధించ‌డానికి జ‌న‌ర‌ల్ అభ్యర్థులైతే 40 శాతం(40 మార్కులు), బీసీలు 35 శాతం (35 మార్కులు), ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం (30 మార్కులు) పొంద‌డం త‌ప్పనిస‌రి.
తుది నియామ‌కాలు
సివిల్ కానిస్టేబుల్‌, జైలు వార్డర్ పోస్టుల‌కు ఫైన‌ల్ ప‌రీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఆయా కేట‌గిరీల్లో ఖాళీలు, రిజ‌ర్వేష‌న్ల ప్రకారం పోస్టింగులు కేటాయిస్తారు. ఏఆర్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు (వంద మార్కులు), ఫైన‌ల్ ప‌రీక్ష (వంద మార్కులు) ఈ రెండింటినీ క‌లిపి మొత్తం 200 మార్కుల్లో ఎక్కువ సాధించిన‌వారికి ఆయా కేట‌గిరీల్లో ఖాళీలు, రిజ‌ర్వేష‌న్ల ప్రకారం మెరిట్ ప్రాతిప‌దిక‌న పోస్టింగులు ఉంటాయి.
ఎంపికైతే
అభ్య‌ర్థులు ఏ పోస్టుకు ఎంపికైన‌ప్పటికీ రూ.16400 మూల‌వేత‌నం చెల్లిస్తారు. దీనికి అద‌నంగా క‌ర‌వుభ‌త్యం(డీఏ), అద్దెభ‌త్యం(హెచ్ఆర్ఏ)ల‌తోపాటు ఇత‌ర ప్రోత్సాహ‌కాలు ఉంటాయి.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...